Home breaking news V 6 నుంచి బిత్తిరి సత్తి జంప్ – ఇక నుంచి TV 9 బిత్తిరి...

V 6 నుంచి బిత్తిరి సత్తి జంప్ – ఇక నుంచి TV 9 బిత్తిరి సత్తి

434
0
బిత్తిరి సత్తి

వీ 6 నుంచి బిత్తిరి సత్తి టీవీ 9లోకి జంప్​ చేశారు. అది కూడా నిన్నటి నుంచే. తెలుగు టీవీ ఛానళ్లలో వీ 6 ఆవిర్భావం నుంచి కొత్త తరహా పోకడే. మిగిలిన​ అన్ని ఛానళ్లకు భిన్నంగా తెలంగాణ యాసలో కొత్త ప్రోగ్రాంలు చేసి.. సక్సెస్​ రేట్​ సాధించింది. ఆ టీవీ ప్రారంభమైన కొత్తలో.. జజ్జనక జనారే ప్రారంభించి.. మార్సుల మీద మార్పులు చేస్తూ.. చివరకు తీన్మార్​గా స్థిరపడింది. తొలుత తీన్మార్ షో రచ్చ రాములమ్మ, మల్లన్న, తీన్మార్ లచ్చవ్వ లాంటి కొత్త క్యారెక్టర్లతో మొదలైంది. అనతి కాలంలోనే ఈ షో ఎంతో పాపులర్ అయ్యింది.  తెలంగాణ ఏర్పడిన కొత్తలో వీ 6 నుంచి తీన్మార్​ టీంను మొత్తం టీవీ 9ను లాక్కుంది. ఆ తర్వాత మల్లన్న అలియాస్​ నవీన్​ రంగ ప్రవేశం చేశారు.

తీన్మార్ ద్వారా.. వీ 6కు ఎంత పేరొచ్చిందో.. అదే స్థాయిలో మల్లన్న అలియాస్​ నవీన్​కు అంతే పేరొచ్చింది. మూడేళ్ల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మల్లన్న వీ 6 నుంచి తప్పుకొని కాంగ్రెస్​ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 10 టీవీకి వెళ్లడం.. మళ్లీ పక్కకు తప్పుకోవడం చివరకు సొంతంగా యూట్యూబ్​ వీడియోలు చేస్తున్నారు. మల్లన్న తర్వాత ఇదే ప్రోగ్రాంలోకి బిత్తిరి సత్తి అలియాస్​ రవి చేరారు. ఈ కార్యక్రమంలో బిత్తిరి సత్తి.. మంగ్లీ మంచి పేరు తెచ్చుకున్నారు. మంగ్లీ తప్పుకున్న తరువాత ఇటీవలే రాములమ్మ క్యారెక్టర్​ కూడా తప్పుకొని బిగ్​బాస్​ 3 ప్రోగ్రాంకు వెళ్లారు. మరో కొత్త క్యారెక్టర్​ను వెతుక్కున్న తర్వాత ఇప్పుడు బిత్తిరి సత్తి వీ6కు షాక్​ ఇచ్చి టీవీ 9లో చేరిపోయారు. ఇక నుంచి బిత్తిరి సత్తి వీ 6లో కాకుండా టీవీ 9లో ఏ క్యారెక్టర్​తో కన్పిస్తారో చూడాలి.

బిత్తిరి సత్తి

టీవీ 9 రజనీకాంత్​ నుంచి ఆపాయింట్​మెంట్​ ఆర్డర్​ తీసుకుంటున్న బిత్తిరి సత్తి అలియాస్​ రవి

రంగారెడ్డి జిల్లాకు చెందిన చెవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి సినిమాల్లో అవకాశాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూశాడు. డబ్బింగ్ ఆర్టిస్ట్​గా పనిచేశాడు. తర్వాత 6 టీవీలో నర్సయ్య తాత క్యారెక్టర్ చేసే అవకాశం లభించింది. టాలెంటెడ్ యాంకర్ కోసం వీ6 చూస్తున్న సమయంలో మల్లన్నను మరిపించేలా బిత్తిరి సత్తి దూసుకొచ్చాడు. ఈ కార్యక్రమం ద్వారా సత్తికి మంచి ఆదరణ లభించింది. 2017లోనే ఆఫర్లు రావడంతో.. తీన్మార్​ నుంచి తప్పుకోవడానికి రవి ప్రయత్నించగా.. అతడి సన్నిహితులు వద్దని వారించి సంగతి తెలిసిందే. తీన్మార్ ద్వారా రవికి ఎంత పేరొచ్చిందంటే.. బయట ప్రోగ్రాంకు హాజరుకావడానికి లక్షల రూపాయలు డిమాండ్​ చేసే స్థాయికి చేరుకున్నారు. సో.. ఏది ఏమైనా చివరకు సత్తి టీవీ 9 గూటికి చేరుకున్నారు. ఇది వీ 6కు షాకే. సత్తి లేకుండానే శుక్రవారం రాత్రి కొత్త క్యారెక్టర్లతో తీన్మార్​ ప్రసారమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here