Home breaking news Tummala comments |మిమ్ముల‌ను కుక్క‌లు కూడ చూడ‌వు- తుమ్మ‌ల‌

Tummala comments |మిమ్ముల‌ను కుక్క‌లు కూడ చూడ‌వు- తుమ్మ‌ల‌

150
0

వ‌య‌సు పెరుగుతున్నా కొద్ది కొంద‌రికి చిన్న పిల్ల‌ల మ‌న‌స్థ‌త్వం వ‌స్తుందంట‌. ఎక్క‌డ ఏం మాట్లాడాలోకూడా తెలియ‌కుండా మాట్లాడుతారు. మోన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ టీఆర్ఎస్ నేత తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుది కూడా అదే పరిస్థితికి వ‌చ్చారా.? అన్న‌ట్టుగా ఉంది. టీఆర్ఎస్‌కు ఓటేయ‌కుంటే.. మిమ్ముల‌ను కుక్క‌లు కూడా చూడ‌వ‌ని ఆయ‌న ఓట‌ర్ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఖమ్మం పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తరఫున తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు నేలకొండపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘పాలేరులో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మీరు వేసిన ఓట్లు మురుగుకాలువలో పడి కొట్టుకుపోయాయి. మీకు వచ్చిన మచ్చ చెరిగిపోదు. నాకు జరిగిన పరాభవం నామా గారికి జరిగితే కుక్కలు కూడా మిమ్మల్ని చూడవు. 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇంత చిన్నతనంగా నాకు ఎప్పుడూ లేదు.’ అని వ్యాఖ్యానించారు. ఆయన ఈ మాటలు అంటున్న సమయంలో తుమ్మలతో పాటు ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పక్కనే ఉన్నారు. ఇక్క‌డ ఇంకో చిన్న విష‌యం గ‌మ‌నించాలి. తుమ్మ‌ల‌పై కాంగ్రెస్ త‌రుపున గెలిచిన ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇక ఓట్లు మురుగుకాలువ‌లో ఎక్క‌డ క‌లిసిన‌ట్టో. అంటే తానోడిపోతే ఓట్లు మురుగుకాలువ‌లో క‌లిసిన‌ట్టేనా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here