Home ఎడ్యుకేషనల్/జాబ్స్ TS Polycet 2019 | టీఎస్ పాలిసెట్-2019 నోటిఫికేషన్

TS Polycet 2019 | టీఎస్ పాలిసెట్-2019 నోటిఫికేషన్

275
0

తెలంగాణ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్-2019 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి విడుదల చేసింది. షెడ్యూలు14-3-2019 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం4-4-2019 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు16-4-2019 ప్రవేశ పరీక్ష24-4-2019 ఫలితాలు
గతంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులతోపాటు ప్రస్తుతం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా పాలిసెట్ రాయవచ్చు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో (www.polycetts.nic.in) దరఖాస్తు చేసుకోవచ్చు.  విద్యార్థులు రూ.400 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250 ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. టీఎస్ ఆన్‌లైన్, మీ సేవ కేంద్రాల్లో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 16న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 24న ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం వెబ్ ఆప్షన్లు తీసుకొని ప్రవేశాలు చేపడతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here