Home breaking news Trs List | బీజేపీ బాట‌లో కేసీఆర్‌..

Trs List | బీజేపీ బాట‌లో కేసీఆర్‌..

152
0

ప్ర‌తి ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల‌ను మార్చ‌డం ఇప్పటివ‌ర‌కూ బీజేపీకి మాత్ర‌మే అలవాటు. ఈ కార‌ణంగా ఆ పార్టీ వివిధ రాష్ట్రాల్లో విజ‌యం సాధించ‌డం జరుగుతూ వ‌స్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన‌ రాజ‌స్థాన్, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘోర పరాజ‌యం పొందుతుంద‌ని అంద‌రూ వేసిన అంఛ‌నాల‌కు భిన్నంగా అభ్య‌ర్థుల‌ను మార్చ‌డం ద్వారా అధికారం అంచుల వ‌ర‌కూ చేరింది. గుజ‌రాత్‌లో తిరిగి అధికారంలోకి వ‌చ్చింద‌. ఇప్పుడు కూడా సిట్టింగ్‌ల‌కు అవ‌కాశ‌మివ్వ‌కుండా.. కొత్త‌వారికి బీజేపీ అవ‌కాశ‌మిచ్చింది. బీజేపీ ప్ర‌ణాళిక‌ను తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌క్కాగా త‌న‌కు అనుకూలంగా మ‌ల్చుకొని అమ‌లు చేస్తున్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల‌ను మార్చారు. ఇప్పుడు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ మార్చారు. ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన 17 స్థానాల్లో న‌లుగురు సిట్టింగ్‌ల‌కు టికెట్లు ఇవ్వ‌లేదు. ఇందులో ఇద్ద‌రు ఫిరాయింపు ఎంపీలు. ఇద్ద‌రు సొంత ఎంపీలు. కాంగ్రెస్, వైసీపీ నుంచి గెలిచిన గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి, పొంగ‌లేటి శ్రీనివాస‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. వీరిద్ద‌రికి ఇవ్వ‌లేదు. అదే విధంగా గ‌తేడాదిలో జ‌రిగిన పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధులు స‌మావేశంలోనే.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, మ‌హబూబాబాద్ ఎంపీలైన జితేంద‌ర్‌రెడ్డి, సీతారాం నాయ‌క్‌కు టికెట్ ఇవ్వ‌న‌ని తేల్చి చెప్పారు. అన్న‌ట్టుగానే ఇవ్వ‌లేదు. మ‌ల్కాజ్‌గిరి, పెద్ద‌ప‌ల్లి ఎంపీలైన మ‌ల్లారెడ్డి, బాల్క సుమ‌న్ ఎమ్మెల్యేలుగా ఎన్నికైనందున వారి స్థానంలో ఇద్ద‌రు కొత్త‌వారికి అవ‌కాశం క‌ల్పించారు. పెద్దపల్లి ఎంపీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎంపీ వివేక్‌కు నిరాశే మిగిలింది. ఈ స్థానాన్ని కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నేతకాని వెంకటేశ్‌కు కేటాయించారు. జ‌హిరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌కు టికెట్ రాద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆయ‌న‌కు టికెట్ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here