Home తాజా వార్తలు Telugu New films | 22న “వినరా సోదరా వీర కుమారా”

Telugu New films | 22న “వినరా సోదరా వీర కుమారా”

39
0

లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకం పై శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం “వినరా సోదరా వీరకుమార”. లక్ష్మణ్ క్యాదారి నిర్మాణంలో సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా నిర్మాత బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ నా మిత్రులు నిర్మించిన ఈ సినిమా ఒక కొత్త పాయింట్ తో అందరిని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను . ప్రేమకోసం చంపడం చావడం రెండు తప్పే అనే కొత్త పాయింట్ ను డైరెక్టర్ సతీష్ చాల అందంగా తెరకెక్కించారు .అని అన్నారు. చిత్ర నిర్మాత లక్ష్మణ్ క్యాదారి మాట్లాడతూ.. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంద‌ని తెలిపారు. వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ పైనే కష్టపడ్డారు దర్శకుడు సతీష్. అందరినీ మెప్పించాలని చేసిన ఈ మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నామ‌ని అన్నారు. దర్శకుడు సతీష్ మాట్లాడుతూ.. అవకాశం ఇచ్చిన నిర్మాత లక్ష్మణ్ కు జన్మాతం రుణపడి ఉంటానని చెప్పారు. కార్యక్రమంలో కేమెరా మాన్ రవి, ప్రముఖ నిర్మాత : అర్జున్, ప్రొడ్యూసర్ :అనిల్ మైలాపూర్, లైన్ ప్రొడ్యూసర్ : కిరణ్ Ch తదితరులు పాల్గొన్నారు. న‌టీన‌టులుః శ్రీ‌నివాస్‌సాయి, ప్రియాక‌జైన్‌, ఉత్తేజ్‌, ఝాన్సీ, జెమిని సురేష్‌, ర‌విరాజ్‌, ప‌వ‌న్‌ర‌మేష్‌, స‌న్ని, రోష‌న్‌, జైబోలో చంటి, డైలాగ్స్ఃల‌క్ష్మీభూపాల‌, సంగీతంః శ్ర‌వ‌ణ్‌భ‌ర‌ద్వాజ్‌, కెమెరాఃర‌వి.వి, డాన్స్ఃఅజ‌య్‌సాయి, స్టంట్స్ఃరాబిన్‌సుబ్బు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ఃఅనిల్ మైలాపుర్ , లైన్ ప్రొడ్యూసర్ : కిరణ్ Ch , ప్రొడ్యూస‌ ర్ః ల‌క్ష్మ‌ణ్‌క్యాదారి, డైరెక్ట‌ర్ఃస‌తీష్ చంద్ర‌ నాదెళ్ళ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here