Home Uncategorized Revanthreddy news | నేను భయపడను – రేవంత్ రెడ్డి

Revanthreddy news | నేను భయపడను – రేవంత్ రెడ్డి

84
0

హైదరాబాద్: *ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు సీఎం కేసీఆర్ నా పై 42 కేసులు పెట్టించారు. కేసులు పెట్టినంత నేను భయపడుతా అనుకుంటే పొరపాటు. ఎన్ని కేసులు పెట్టినా భయపడను.*అని టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న ఆయన నామినేషన్ దాఖలు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ..ఐటీఐఆర్ ను సాధిస్తే మల్కాజ్ గిరి మరో హైటెక్ సిటీ అయ్యేదన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యం.కారణంగా మినీ భారత్ గా ఉన్న మల్కాజిగిరి అభివృద్ధిలో వెనుకబడి పోయిందన్నారు. తనను గెలిపిస్తే పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేస్తానని ప్రకటించారు. స్నార్ట్ సిటీ కావాల్సిన మల్కాజిగిరికి గత ఎంపీ మల్లారెడ్డి పట్టించుకోలేదన్నారు. నేను గెలిస్తే ఆరునెలల్లో కంటోన్మెంట్ మెంట్ రోడ్డుకు శాశ్విత పరిష్కారం చూపెడతానని ప్రకటించారు. *ఐదేళ్లు 16 మంది ఎంపీలుండి గూడా ఇరవై నాలుగు పైసలు  కేంద్రం ఇవ్వలేదంటున్న కేటీఆర్ ..ఇప్పుడు గెలిస్తే ఏం సాధిస్తాడని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రధాని అవుతారంటూ టీఆర్ ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ప్రస్తావిస్తూ పార్లమెంట్ కు పోటీ చేయకుండా కేసీఆర్ ఎలా ప్రధాని అవుతారు .? అని ఆయన ప్రశ్నించారు. *ఎన్నికల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టాలన్న ఉద్దేశ్యం తోనే కేసీఆర్ ప్రధాని అవుతారని కవిత అబద్దం చెబుతున్నారని రేవంత్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బులుండి దందాలు చేసేవారికి కేసీఆర్ టికెట్లు ఇచ్చారని తెలిపారు. వాళ్ళద్వారా తెలంగాణ సమాజాన్ని వ్యాపార కేంద్రం గా మార్చుకున్నారని ఆరోపించారు. రూ. 100 కోట్లకు పైగా ఖర్చుపెట్టే వారికి టికెట్లు ఇచ్చారని తెలిపారు. జితేందర్ రెడ్డి, సీతారాం నాయక్, వివేక్  పరిస్థితి దిక్కుతోచకుండా ఉందని చెప్పారు. కేవలం పేమెంట్ కోటలోనేమల్లారెడ్డి కి  మంత్రి పదవి వచ్చిందని వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డికి వేలంపాటలో మల్కాజిగిరి టికెట్ వచ్చిందని చెప్పారు. డబ్బులిచ్చి టెకెట్లు కొనుక్కున్న ఇలాంటి వారు ప్రజాసమస్యల పై మాట్లాడతారా? అని ప్రశ్నించారు. తనను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని రేవంత్ హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here