Home breaking news Ramgopal varma new film | జ‌య‌ల‌లిత‌పై వ‌ర్మ సినిమా

Ramgopal varma new film | జ‌య‌ల‌లిత‌పై వ‌ర్మ సినిమా

104
0

ఎన్టీఆర్ పై సినిమా తీసి సంఛ‌ల‌న విజ‌యం సాధించిన రామ్‌గోపాల్ వ‌ర్మ‌.. మ‌రో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ సినిమా జ‌య‌ల‌లిత జీవితంపై తీయ‌నున్నారు. జ‌య‌ల‌లిత జీవితంపై తీసే ఈ సినిమాకు శ‌శిక‌ళ టైటిల్‌ను ఖ‌రారు చేశారు. అయితే గతంలోనే జ‌య‌ల‌లిత స‌న్నిహిత స్నేహితురాలు.. శశికళపై సినిమా తీస్తానని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆ సినిమాకు సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను త‌న‌ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. శశిక‌ళ టైటిల్‌లో ఇంగ్లిష్‌తో ఉన్న అక్ష‌రాల పక్క‌నే జ‌య‌లలిత‌, శ‌శిక‌ళ కూర్చున్న ఫొటోను జ‌త చేశారు. ట్యాగ్‌గా.. ‘లవ్ ఈజ్ డేంజరస్లీ పొలిటికల్’ అని చేర్చారు. ఈ సినిమా పూర్తిగా దయలేని మనుషులుకు, మన్నార్‌గుడి గ్యాంగ్స్‌కు, జైలు గోడలకు మధ్య ఉన్న సంబంధాల చుట్టూ తిరుగుతుందని తెలిపారు రాంగోపాల్ వ‌ర్మ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here