Home తాజా వార్తలు Rahul Comments on Modi రాహుల్ జీ క్యాబాత్ హై

Rahul Comments on Modi రాహుల్ జీ క్యాబాత్ హై

214
0

కాంగ్రెస్ రాకుమారుడు రాహుల్ గొప్ప మాట సెలవిచ్చారు. ఆరోపణలు ఎదుర్కొనే ప్రతి ఒక్కరినీ విచారించే హక్కు ప్రభుత్వానికి ఉందని చెప్పేశారు. ఎంపిక చేసుకున్న వారికే కాదుచట్టం ప్రతి ఒక్కరికీ వర్తించాలని సూచించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాద్రా (రాహుల్ బావ)ని విచారించాలని సేమ్ టైం ప్రధాని మోదీని విచారించాల్సిందేనని వ్యాఖ్యానించారు. రాఫెల్ ఒప్పందంలో ప్రధాని కార్యాలయం ప్రమేయమున్నదన్న అంశాన్ని ప్రస్తావిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. రాహుల్ డిమాండ్ సహేతుకమైనదే. కాకుంటే వాద్రాకు సంబంధించి అగస్టా కుంభకోణంలో కేసుల నమోదు, విచారణ జరుగుతోంది. రాఫెల్ అంశంపై ఇంకా ఏం జరగలేదు. దీనిపై మోదీని విచారించాలంటే ముందు మీరు అధికారంలోకి రావాలి. అవినీతి జఠిగిందని నిర్ధారణ చేసుకోవాలి. మోదీని విచారించాలి రాహుల్ జీ. అప్పటి వరకూ వాద్రాను అదే మీ బావను విచారించాలిగా. ఏళ్ల కిందటి అగస్టా కేసు.. ఇప్పటి వరకు ఏం జరిగిందో కూడా పూర్తిగా తెలియని రాఫెల్ అంశాన్ని పోలుస్తారా రాహుల్ జీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here