Home తాజా వార్తలు Pavan vs Paul | త‌మ్ముడూ ఓడిపోతావ్‌- కేఏ పాల్‌

Pavan vs Paul | త‌మ్ముడూ ఓడిపోతావ్‌- కేఏ పాల్‌

76
0

ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో సహజ నటుడికి, సినిమా నటుడు మధ్య పోరాటం జరగబోతోంది. సహజ నటుడికి ఒక వర్గం నుంచి పెద్ద పాలోయింగ్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితి మారిందనుకోండి. అది వేరే విషయం. సినిమా నటుడికి  ఇప్పటికీ పాలోయింగ్ ఉంది. ఈ పాలోయింగ్ ఎన్నికల్లో ఏ మేరకు పని చేస్తుందో 11న్ పోలింగ్ జరుగనుంది, మే 23న  ఫలితంతో తేలిపోతుంది. అది వేరే సంగతి. ఇంతకీ సహజ నటుడు ఎవరంటే అదే ప్రజాశాంతి వ్యవస్థాపకుడు కే ఏ పాల్. సినిమా నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. సరే ఇక్కడ ప్రత్యేకం ఏమిటంటే వీళ్లిద్దరూ భీమవరం నుంచి తలపడుతున్నారు. పాల్ 25న నామినేషన్ వేస్తానని చెప్పారు.  ఆయన చెప్పిన విషయం ఏమిటంటే.. తమ్ముడు పవన్ కల్యాణ్ ను పార్టీలోకి రమ్మని ఆహ్వానించా. రాలేదు కాబట్టే పవన్ పై పోటీకి దిగుతున్నా అని ప్రకటించారు. నర్సాపూర్‌లో నాతో ఎంపి గా  పోటీ చేయొద్దని నాగబాబు కు చెప్పానని తెలిపారు. దిగితే డిపాజిట్ పోతుందని హెచ్చరించారు. ఓటు బ్యాంకు లేని బీఎస్పి, వామపక్షాలతో జత కట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నర్సాపురం లో నామినేషన్ వేసేందుకు వెల్తుంటే టిడిపి, వైసిపి, జనసేన నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.  నేను హెలికాఫ్టర్ బుక్ చేస్తే జగన్, చంద్రబాబు కావాలనే క్యాన్సిల్ చేయించారని తెలిపారు. లక్ష కోట్లు దాచుకున్న జగన్ కు కేసీఆర్ వెయ్యి కోట్లు ఇస్తే నష్టపోతారన్నారు. వైసిపి, టిడిపి, జనసేన రెబల్స్ కొట్టుకోకండి ప్రజాశాంతి పార్టీ ఆహ్వానం పలుకుతోంది రండి టికెట్లు ఇస్తా అని పాల్ ఆహ్వానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here