Home తాజా వార్తలు Nene Devunni Movie Trailer Review ||నేనే దేవుణ్ని ట్రైల‌ర్‌ రివ్యూ

Nene Devunni Movie Trailer Review ||నేనే దేవుణ్ని ట్రైల‌ర్‌ రివ్యూ

631
1
2229930590598310

విమ‌ర్శ‌ల‌కు ఎవ‌రూ అతీతులు కాదు. ఇందులో ప్ర‌జ‌లు ఆరాధించే భ‌గ‌వంతుడికి, ఆయ‌న‌కు తామే మ‌ధ్య వ‌ర్తుల‌మ‌ని చెప్పుకునే వ్య‌వ‌స్థ అతీతం కాదు. తాజాగా శివ‌శ‌క్తి సంస్థ‌కు చెందిన‌ క‌రుణాక‌ర్ సుగ్గున నేనే దేవుణ్ని టైటిల్‌తో సినిమా తీస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్‌లో త‌న యూ ట్యూబ్ ఛాన‌ల్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమాను పూర్తిగా క్రైస్త‌వ మ‌తం, ఏసు క్రీస్తు, ఫాస్ట‌ర్ వ్య‌వ‌స్థ‌ను ఉద్దేశించి విమ‌ర్శ‌నాత్మ‌కంగా తీస్తున్నారు. ముందుగా విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌లో తాను చెప్ప‌ద‌లుచుకున్నదేమిటో కొంత‌ చూపించారు. క్రైస్త‌వంపై క‌రుణాక‌ర్ సుగ్గున రాసిన *బైబిల్ దేవుడి నిజ‌స్వ‌రూప, స్వ‌భావాలు * పుస్త‌కంపై యూ ట్యూబ్ వేదిక‌గా చ‌ర్చోప చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఇంత‌కీ ట్రైల‌ర్‌లో ఏముందంటే..

 • యేసు రెండ‌వ రాక‌డ‌లో వ‌చ్చి క్రైస్త‌వ మతంలోకి మార‌ని వారంద‌రినీ న‌ర‌కంలో ప‌డేస్తాడు* అన్న‌ బైబిల్, మ‌రియు పాస్ట‌ర్లు వ్యాఖ్యంతో
  నేనే దేవుణ్ని ట్రైల‌ర్ ప్రారంభ‌మవుతోంది.
  వ‌రుస‌గా పాస్ట‌ర్ల‌కు సంబందించిన‌ స‌న్నివేశాలు వ‌స్తాయి.
 • ఆ దేవుడు ఈ రోజే మీ హృదయంలో త‌ట్టుచున్నాడు*
  హిందూ స‌మాజాన్ని ఉద్దేశించి ఒక పాస్ట‌ర్ చేసిన * ఈ ద‌రిద్ర దేవ‌త‌లు, విగ్ర‌హాలు మిమ్ముల‌ను ర‌క్షించ‌లేవు*
  క్రైస్త‌వ సమాజానికి త‌న‌కు తానే డాడిగా చెప్పుకుంటున్న జ‌య‌శాలి స్ట‌యిల్‌లో * కాద‌న్న వాన్ని నా కాలికింద పెట్టి న‌లిపేస్తా వాన్ని.*
 • నువ్వు దిగిరా తండ్రి. మేము ఒప్పుకోం. నీవు రాక‌పోతే మేము ఒప్ప‌కోము.*
 • గంగ వ‌చ్చిన‌ట్టుగా ఏస‌య్య అక‌స్మాత్తుగా వ‌స్తాడు.* ఈ సిన్ పూర్తికాగానే.. ఏస‌య్య పాత్ర‌దారి ఆకాశం నుంచి భూమ్మీద‌కు వ‌చ్చి పాస్ట‌ర్ ఎదురుగా నిలుచుంటాడు. ఆశ్చ‌ర్య‌పోయిన పాస్ట‌ర్ ఎవ‌రు నువ్వు అని ప్ర‌శ్నిస్తాడు.
  ఐయాం గాడ్‌
  ఆహా.. నేను కూడా ప్ర‌వ‌క్త‌నేలే అంటాడు.
  ఓ దేవాల‌యం వ‌ద్ద పూజ‌లు చేయ‌డానికి వ‌చ్చిన హిందువుల‌తో పాటు తాను దేవుణ్ని అని చెప్పినా న‌మ్మ‌ని క్రైస్త‌వుల‌ను ఉద్దేశించి.. * మిమ్ములంద‌రినీ న‌ర‌కంలో ప‌డేస్తాను* అని వ్యాఖ్యానిస్తాడు.
 • ఏంటీ ఎక్కువ చేస్తున్నావంటూ* ఓ క్రైస్త‌వుడు చేయి లేప‌గానే.. అత‌డి చేయి పట్టుకొని న‌లిపేస్తాడు.
  దెబ్బ ప‌డితే ఊరుకోవ‌డానికి ముఖం మీద ఉమ్ము ప‌డితే తుడిచేసుకోవ‌డానికి ఇది మొద‌టి రాకడ కాదురా. రెండో రాక‌డ‌ అనేస్తాడు.
  ఇప్పుడు శివ‌శ‌క్తి సంస్థ అధ్య‌క్షుడు క‌రుణాక‌ర్ సుగ్గున ఎంట‌ర్ అవుతారు.
  ఏసు పాత్ర‌దారిని ప‌ట్టుకొని * ఏంటీ గురుగారు.. ఏదైనా డ్రామా కంపెనీలో కేరెక్ట‌ర్ వేసి వ‌స్తున్నారా..? ఇంకా కేరెక్ట‌ర్‌లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు లేదు.* అని ప్ర‌శ్నిస్తాడు.
  ఉజ్జీవ స‌భ‌ల్లో పాస్ట‌ర్లు చేసే స్వ‌స్థ‌త డ్రామాను చూపించి.. అక్క‌డ‌కు వ‌చ్చిన ఏసు పాత్ర‌దారికి స్వ‌స్థ‌త చేకూర్చ‌డానికి చేసే ప్ర‌య‌త్నానికి ప‌డిపోక పోవ‌డంతో.. స‌ద‌రు పాస్ట‌ర్ త‌న అనుచ‌రుల‌తో ఏంట్రా డైలాగ్ చెప్ప‌డు. ఎక్క‌డిని నుంచి ప‌ట్టుకొచ్చార్రా.. అంటూ ప్ర‌శ్నిస్తాడు. ఇదే స‌మ‌యంలో టీవీ యాంక‌ర్ స్వాతినాయుడు రంగ ప్ర‌వేశం చేసి.. ఏసు పాత్ర‌దారిని *ప్లీజ్ బంగారం నా బుజ్జి క‌దా. ప్చ్‌.. అంటూ ముద్దు పెట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది.
  *నువ్వు నిజంగా జీస‌స్‌వా.?* అంటూ క‌రుణాక‌ర్ ప్ర‌శ్నించ‌డంతో.. ఓరి చెడుద‌రుమరుడా.. న‌న్ను మొద‌టి రాక‌డ‌లోనూ న‌మ్మ‌లేదు. రెండో రాక‌డ‌లోనూ న‌మ్మ‌డం లేదు. అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తాడు.
  య‌వ్వ‌న‌స్తుల కూడిక‌కు సంబంధించిన సీన్‌లోనూ.. * ఆ దేవుడి ప‌నికి ఆటంకం క‌ల్గించుచున్న ఓ సాతానా అవ‌త‌ల‌కి పొమ్ము.* అంటూ ఓ పాస్ట‌ర్ ఏసును పంపించి వేస్తాడు.
  దీంతో ఖిన్నుడై * వీరిని త‌న‌పై తిర‌గ‌బ‌డే విధంగా ప్రేరేపించిన‌ది ఎవ‌రు..? ఎవ‌రు ఎవ‌రై ఉంటారు.* అంటూ స్వ‌గతంలో మ‌ద‌న ప‌డుతున్న ఏసు పాత్ర‌దారిని ఉద్దేశించి.. అదంతా అర్థం కావాలంటే ముందు మీకు కొన్ని విష‌యాలు తెలియాలి. ఇంకా ఏమాలోచిస్తున్నారు. కాస్త న‌మ్మండి గురుగారు..ఎంత సేపు నేనే దేవుణ్ని, నేనే దేవుణ్ని అని మాకు చెప్ప‌డం కాదు. కాస్త మమ్ముల‌ను కూడా న‌మ్మండి.* అన్న క‌రుణాక‌ర్ వ్యాఖ్య‌లు.
  ఏసు రాజుగా వ‌చ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. అన్న సీన్‌తో ఈ ట్రైల‌ర్ ముగిసిపోతుంది.
 • మొత్తానికి ఈ ట్రైల‌ర్‌లో క్రైస్త‌వ స‌మాజం, పాస్ట‌ర్ల స్వ‌భావాన్ని చూపించాడు. ఇక సినిమాలో ఏ విధంగా ఉండ‌బోతుందో. ఈ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన కొన్ని రోజులోనే దాదాపు 3 ల‌క్ష‌ల మంది చూశారు. దీనిపై క్రైస్త‌వ స‌మాజంలోని పాస్ట‌ర్లు విమ‌ర్శ‌ల‌తో కూడిన వీడియోల‌ను విడుద‌ల చేశారు. ఈ వీడియోల‌ను పెద్ద సంఖ్య‌లో చూస్తున్నారు. మొత్తానికి యూ ట్యూబ్‌లో నేనే దేవుణ్ని సినిమాపై పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. చివ‌ర‌గా చెప్పొచ్చేదేమిటంటే..
 • సినిమాలు, సీరియ‌ల్లున క‌థ‌ల్లో హిందూ స‌మాజంపై విమ‌ర్శ‌లు చేసినా.. కామెడీ చేసినా.. ప‌ట్టించుకోరు కానీ.. ఇత‌ర వ‌ర్గాల‌పై చేస్తే మాత్రం సీరియ‌స్‌గా మారిపోతుంది. వీటికి సంబంధించి కొన్న సంఘ‌ట‌న‌ల‌ను వివరిస్తాను. *
  భ‌గ‌వంతుడికి భ‌క్తుడికి మ‌ధ్య సంధాన‌క‌ర్త‌గా హిందువుల్లో పూజారి వ్య‌వ‌స్థ‌, ముస్లింలో ఇమామ్ మౌజామ్, క్రైస్త‌వుల్లో ఫాస్ట‌ర్ వ్య‌వ‌స్థ ఉంది. సంధాన‌క‌ర్త‌ల్లో ఎక్కువ‌గా హిందూ పూజారుల‌పై విమ‌ర్శ‌లు, జోకులు వ‌స్తుంటాయి. దీనిపై పెద్ద‌గా అభ్యంతారాలు రావు. చేసిన వారిని ఆర్ఎస్ఎస్ కు చెందిన వారిగా చిత్రీక‌రించ‌డం ప‌రిపాటే. కానీ ఇత‌ర మ‌తాల‌కు చెందిన వారిపై దాదాపుగా రావు. వ‌స్తే దానిపై గొడ‌వ‌లు జ‌రుగుతూ ఉంటాయి. ఈనాడు దిన‌ప‌త్రిక‌లో ఒక‌సారి సోనియాగాంధీకి ముస్లిం త‌ర‌హాలో టోపీ, గ‌డ్డం పెట్టి కార్టున్ వేస్తే జ‌రిగిన గొడ‌వ అంతా ఇంతా కాదు. దీనిపై చివ‌ర‌కు ఈనాడు క్ష‌మాప‌ణ చెప్పి.. కార్టున్ ఉప‌సంహ‌రించుకున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఇదే విధంగా ఆంధ్ర‌ప్ర‌భలో రెండేళ్ల క్రితం వ‌చ్చిన వ్యాసంలో అల్లాకు ప్ర‌తిరూపంగా ఒక బొమ్మ‌ను ప్ర‌చురించారు. దీనిపై పోలీస్ స్టేష‌న్‌లో కేసులు.. ముస్లిం మ‌తానికి చెందిన కొంద‌రి నుంచి బెదిరింపులు.. ప‌త్రిక కార్యాల‌యానికి పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేసుకోవాల్సి వ‌చ్చింది. చివ‌ర‌కు క్ష‌మాప‌ణ‌తో వివాదం స‌ద్దుమ‌నిగింది. ఇటీవ‌లే వెంక‌టేశ్ ప్ర‌ధాన పాత్ర‌తో గోపాల గోపాల సినిమా వ‌చ్చింది. ఈ సినిమాలో తీసిన స‌న్నివేశాలు.. మొత్తం హిందూ పూజారీ వ్య‌వ‌స్థ‌పైనే బుర‌ద జ‌ల్లాయి. దీనిపై కొంద‌రు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసినా.. ప‌ట్టించుకునే వారే క‌రువ‌య్యారు. ఏ వ్య‌వ‌స్థ‌లోనైనా.. మంచి చెడు రెండూ ఉంటాయి. అలా అని వ్య‌వ‌స్థ‌నే దోషిగా చూపిస్తూ అవ‌హేళ‌న చేస్తే ఎలా..? తొలిసారిగా క్రైస్త‌వ స‌మాజంపై నేనే దేవుణ్ని టైటిల్‌తో క‌రుణాక‌ర్‌ సినిమా తీస్తున్నారు. సినిమా విడుద‌లైన తరువాత ఎలా ఉంటుందో చూద్దాం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here