Home తాజా వార్తలు Motkupally Comments on babu | బాబు సీక్రెట్ చెప్పిన మోత్కుప‌ల్లి

Motkupally Comments on babu | బాబు సీక్రెట్ చెప్పిన మోత్కుప‌ల్లి

152
0

 సమయమొచ్చినప్పుడు అన్ని ముచ్చట్లు చెబుతా. అన్ని విషయాలు బయట పెడతా అంటూ కొందరు చెబుతుంటరు. ఇటువంటి డైలాగులన్నీ రాజకీయ నాయకులే చెబుతుంటరు. పార్టీల ఆళ్లను పట్టించుకోని టైంలా. లేకుంటే ఈల్లే పార్టీని పట్టించుకోని టైంల అవిగుడా అన్ని చెప్పకుండా కొన్ని ముచ్చట్లు చెబుతరు. అవి గూడా అందరికీ తెలిసిన ముచ్చట్లే కని తామేదో ఇప్పుడే బయట పెట్టినట్టు.. మొకం ఇంత పెట్టుకుని చెబుతరు. ఇప్పుడు గట్లనే మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా నిన్న చంద్రబాబు గురించి చెప్పిండు. మామకు వెన్నుపోటు పొడిచారని కొత్త ముచ్చట చెప్పినట్టు చెప్పిండు. ఈ ముచ్చట చెప్పే ముందు తాను కూడా లక్ష్మీ పార్వతి వర్గం నుంచి చంద్రబాబు దగ్గరికి ఎందుకు పోయిండో గా ముచ్చట కూడా చెబితే బాగుండేది. లక్ష్మీ పార్వతి ఎంటరైనా కాన్నుంచి వెన్నుపోటు వరకూ ఏం జరిగిందో చంద్రబాబు యాంగిల్, లక్ష్మీ పార్వతి యాంగిల్ కాకుండా అసలేం జరిగిందో చెబితే లెక్క. ఎందుకంటే ఈ సీన్లల్లా మొత్తం మోత్కుపల్లి ఉన్నడు. ఆయనకు A to Z తెలుసు. అది చెబితే కొత్త ముచ్చట. అందరికీ తెలిసిన ముచ్చటెందుకు మాకెందుకు సారూ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here