Home తాజా వార్తలు Modi vs Ex Bjp Leader | క‌డుపు మంట‌తో మోదీని

Modi vs Ex Bjp Leader | క‌డుపు మంట‌తో మోదీని

193
0

మ‌నిషికి ఎన్నిరోగాలు వ‌చ్చినా త‌గ్గుత‌యంట క‌ని క‌డుపులో మంట (అసిడిటీ కాదు) మాత్రం త‌గ్గ‌దంట‌, ఈ ముచ్చ‌ట‌ను గామొన్న కాంగిరేసు ప్ర‌తిప‌చ్చ నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే చెప్పిండు. ఈ ముచ్చ‌ట గాయినెందుకు చెప్పిండంటే.. బీజేపీ లీడ‌ర్ ఎడ్యూర‌ప్ప‌.. గ‌డికోసారి మీ స‌ర్కారును కూల‌గొడ‌తం. కూలిపోత‌ద‌ని అంటుంటే ఈ మాట చెప్పిండునుకో. స‌రేక‌ని క‌డ‌పుల మంట మాట గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా.. బీజేపీలో సౌంత్ ఇండియ‌న్ స్టార్‌లాగా ఒకెలుగు ఎలిగినాయ‌న‌కు పీఎం మోదీ అంటే సెడ క‌డుపుమంట‌ట‌. ఎందుకంటే ఆయ‌న‌కు ద‌క్కేదీ ద‌క్కకుండా చేసిండ‌ని. 2014 ఎన్నిక‌ల‌కు ముందు ఒకే పొగుడుడే పొగుడుడు. స‌ర్కారు వ‌చ్చినంక మంత్రి ప‌ద‌వి ఇచ్చిండ్రు క‌ని మ‌ధ్య‌లో తీసేసిండ్రు. ఈ దెబ్బ‌కు ఆయ‌న‌కు ఎంత మంటుందంటే.. ఎప్పుడొచ్చినా.. ఏట్ల‌లో ఒక‌ట్ల మోదీని పిన్నీసుతో గిచ్చిన‌ట్టుగా మాట్లాడుత‌డు. మ‌నిండ్ల‌ల్ల బుడ్డ పోర‌గాళ్లు.. ఆనికి న‌చ్చింది ప‌క్కోడు క‌రాబు చేస్తే.. ఎవ‌నికి క‌న‌బ‌డకుండా.. సంక‌ల‌ల్ల‌, గ‌జ్జ‌ల‌ల్ల గిచ్చుత‌డు చూడు గ‌ట్ల‌. కొంద‌రు మోగోళ్లు కూడా పెండ్లాల‌ను ఎవ‌నికి చూపిచ్చుకోని తావ‌ళ్ల‌ల్ల గిచ్చుత‌రంట చూడు. ఆళ్లేవ‌రికి చూపించ‌కులేరు. గ‌ట్ల‌న్న మాట‌. కాకుండా ఇక్క‌డ మోదీని గిచ్చ‌లేడు కాబ‌ట్టి.. టైం దొరిక‌న‌ప్పుడ‌ల్లా.. మ‌న‌లాంటోళ్ల‌కు అర్థంమయ్యేటట్టు గిచ్చే మాటలు మాట్లాడుతరు. నిన్న కూడా ప‌ట్నం వ‌చ్చిన ఆయ‌న గ‌ట్టే మాటాడిండు. రైతుల క‌ష్టాలు బాగా పెరిగిపోయిన‌యి ఆటిని తీర్చాలంటూ అంటే ఇప్ప‌డ‌నే కాదంటూ మ‌ర్పించ్చుండు. గ‌ప్ప‌ట్లంటే 35 ఏండ్లు స‌ర్కార్ల‌ను ఒపిక‌బ‌ట్టి చూసిండ్రు క‌ని ఇప్పుడు ఐదేండ్లు కూడా చూడ‌డం లేదన్న‌డు. గిన్ని ప‌నులు చేసిన‌మంటే.. గ‌వి చేయ‌లేదుగా అంట‌రు చెప్పుకుంటూ పోయిండు. ఇప్పుడిచ్చిన హామీలు కాదు అప్పుడు ఇచ్చిన మాట‌లు తీర్చిర్ర లేదా చూడాలంటున్నడు. విశ్వాసం ఉన్న పార్టీకే ఓటేయాలంటూ పిలుపునిచ్చిండు. ఇంత‌కీయ‌న బాధేంటంటే… త‌న‌ను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌ను నుంచి దూరం చేసిండ‌న్న ఉక్రోషంతోటి చెప్పాల్సిన‌న్ని చెప్పిండు. స‌రే ఎంత తిట్టిన క‌డుపు మంట చ‌ల్లార‌దుగా. ఎందుకంటే దీనికి మందే లేదు. ఆయ‌నకు త‌గ్గ‌దు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here