Home breaking news Maoist party | ఎన్నిక‌లను బ‌హిష్క‌రించండిః మావోయిస్టు పార్టీ

Maoist party | ఎన్నిక‌లను బ‌హిష్క‌రించండిః మావోయిస్టు పార్టీ

122
0

పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించాలని సీపీఐ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ పార్లమెంటరీ ఎన్నికల చరిత్రలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొంది. అందుకే ఈ ఎన్నికలను బహిష్కరించి నిజమైన రాజకీయాధికారాన్ని స్థాపించుకోవాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేర‌కు ఆ పార్టీ తెలంగాణ క‌మిటీ అధికార ప్రతినిధి జగన్ ఒక ప‌త్రిక‌ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలన్నీ ప్రజావ్యతిరేక పార్టీలని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. 2014 ఎన్నికల్లో యూపీఏ – 2 ప్రభుత్వంపై ప్రజల‌ అసంతృప్తిని, వ్యతిరేకతను ఉపయోగించుకొని అనేక వాగ్దానాలు ఇచ్చిన మోదీ నాయకత్వంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే అధికారంలోని వచ్చింన సంగ‌తిని గుర్తు చే శారు. అయితే ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క‌టి కూడా ఈ ఐదేళ్ల‌లో మోదీ అమ‌లు చేయ‌లేద‌ని ఆరోపించింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోల్ ధరల పెంపు, వ్యవసాయ సంక్షోభం కారణంగా ప్రజానికం తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపింద‌. న‌ల్ల‌ధనం తేకపోగా 2 కోట్ల మందికి ఉద్యోగాలే లేకుండా చేశారని జ‌గ‌న్ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ప్ర‌జా వ్య‌తిరేక‌మైన పార్టీలు, వాటి పాల‌న‌కు కార‌ణ‌మైన పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించాల‌ని పిలుపునిచ్చింది. త‌ద్వారా నూతన ప్రజాస్వామ్యాన్ని అందించే విప్లవాన్ని విజయవంతం చేయాలని కోరింది.

మావోయిస్టు ప్ర‌తినిధి జ‌గ‌న్ విడుద‌ల చేసిన పూర్తి లేఖ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here