Home breaking news Manifesto released | రైతుకు ప్ర‌త్యేక‌ బ‌డ్జెట్‌

Manifesto released | రైతుకు ప్ర‌త్యేక‌ బ‌డ్జెట్‌

84
0

మొత్తానికి కాంగ్రెస్ త‌న మెనిఫెస్టో విడుద‌ల చేసింది. దేశ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల ప్ర‌కారం తాము మెనిఫెస్టోను రూపొందించామ‌ని ప్ర‌క‌టించింది. తాము అధికారంలోకి వ‌స్తే వ్య‌వ‌సాయ‌రంగానికి ప్ర‌త్యేక బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని హామీ ఇచ్చింది. అదే విధంగా పేద‌ల‌కు క‌నీస ఆదాయ ప‌థ‌కం అమ‌లు చేస్తామ‌ని పేర్కొంది. ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ ఈ మెనిఫెస్టోను విడుద‌ల చేశారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన ప్ర‌ధాన హామీ ఇచ్చారు. రైతులు, యువత, మహిళలు, పరిశ్రమలు, మైనారిటీలు, విద్య, వైద్యం, జాతీయ భద్రత, విదేశాంగ విధానం వంటి కీలకాంశాలను తమ ప్రణాళికలో పొందుపరిచామని తెలిపారు. దేశంలోని ఐదు కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏటా రూ 72,000 కోట్ల నగదును అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. మ్యానిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు కోట్లాది మంది ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తిబింబిస్తాయ‌ని తెలిపారు.

ప్రధాన హామీలివే..
పేదలకు కనీస ఆదాయ హామీ పధకం
ఒక్కో నిరుపేద కుటుంబానికి ఏటా రూ 72వేల ఆర్ధిక సాయం
ప్ర‌త్యేకంగా రైతు బడ్జెట్‌
అధికారంలోకి వ‌చ్చిన తొలి ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ
100 నుంచి 150 రోజులకు ఉపాధి పెంపు
బడ్జెట్‌లో విద్యారంగానికి ఆరు శాతం నిధులు
ప్రభుత్వ వైద్య సేవల విస్తరణ
యువతకు మూడేళ్లపాటు అనుమతులు లేకుండా వ్యాపారం చేసుకునే అవ‌కాశం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here