Home తాజా వార్తలు Maheshbabu | బాగున్నావా..? బాగున్నా.| మైన‌పు బొమ్మ‌తో మ‌హేశ్

Maheshbabu | బాగున్నావా..? బాగున్నా.| మైన‌పు బొమ్మ‌తో మ‌హేశ్

183
0

ప్రపంచ ప్రఖ్యాత మేడమ్‌ తుస్సాడ్స్‌ మ్యూజియంలో మహేశ్‌బాబు మైన‌పు బొమ్మ చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ ఉన్నవారి రూపాల్ని మైనపు బొమ్మలుగా చేసి మ్యూజియంలో ఉంచటం టుస్సాడ్స్ స్సెష‌ల్‌. ఇప్పటివరకూ హిందీ న‌టులు అమితాబ్‌ బచ్చన్, షారుక్‌ ఖాన్ వంటి అనేక‌మంది మైన‌పు బొమ్మ‌లు ఇక్క‌డ దర్శనమిస్తుంటాయి. తెలుగు న‌టుడు ప్రభాస్ మైన‌పు బొమ్మ ఆల్రెడీ బ్యాంకాక్‌ తుస్సాడ్స్‌ మ్యూజియమ్‌లో ఉంది.


సింగపూర్‌లోని సెంథోసా ఐల్యాండ్‌లో తుస్సాడ్స్‌ మ్యూజియంలో మహేశ్‌ మైనపు విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. అయితే ముందుగా మ‌హేశ్ మైన‌పు బొమ్మ‌ను హైదరాబాద్‌లో ‘ఏఎంబీ మాల్‌’లో ఆవిష్కరించారు. మహేశ్‌ మైనపు బొమ్మను తయారు చేయటానికి గ‌తేడాది మేడ‌మ్ టీం వ‌చ్చి.. 200 శరీర కొలతలు తీసుకున్నారు. ఈ బొమ్మ‌ను త‌యారు చేయ‌డానికి 20 మంది ఆరు నెలల పాటు క‌ష్ట‌ప‌డ్డారు. మహేశ్‌ ‘శ్రీమంతుడు’ టైమ్‌ లుక్‌తో బొమ్మను తయారు చేశారు.
త‌న మైన‌పు బొమ్మ‌ను చూడ‌డానికి వ‌చ్చిన మ‌హేశ్, భార్య న‌మ్ర‌త‌, కుమారుడు గౌత‌మ్‌, కుమార్తె సితార సెల్ఫీలు దిగారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ సూప‌ర్‌స్టార్ల మ‌ధ్య‌లో నా బొమ్మ భాగ‌మ‌వ్య‌డం త‌న‌కు ద‌క్కిన గౌర‌వ‌మ‌ని వ్యాఖ్యానించారు. త్వరలో నా ఫ్యామిలీతో కలిసి సింగపూర్‌ వెళ్లి నా బొమ్మ‌ను అక్క‌డే చూసుకోవాలని ఉంద‌ని చెప్పారు. ‘మీ బొమ్మతో మీరు మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? అని మహేశ్‌ను అడిగితే – ‘‘ఎలా ఉన్నావు? బావున్నా’’ అంటా అన్నారు. అనంతరం తన ప్రతిమలానే పోజిచ్చి ఫొటోలు దిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here