Home తాజా వార్తలు Mahaghatbandan బొంగ‌రం కూడా తిప్ప‌లేరా..?

Mahaghatbandan బొంగ‌రం కూడా తిప్ప‌లేరా..?

120
0

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతామంటున్న వాళ్లు బొంగ‌రాలు కూడా తిప్ప‌లేరా.? ఈ ఫ్రంట్‌లు ఏమ‌య్యాయి. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏమైంది. మ‌హా ఘ‌ట్బంధ‌న్ ఏమైంది. ఈ రెండు కూట‌ముల పేరుతో.. దేశంలో ప‌ర్య‌ట‌న‌లు చేసి తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఏం మాట్లాడ‌డం లేదే. ఫ్రంట్ ప్ర‌స్తావన తేవ‌డం లేదే. ఎన్నిక‌ల విష‌యానికొస్తే తెలంగాణ‌లో కేసీఆర్ ఒంట‌రిగానే పోటీ చేస్తున్నారు. ఇక్క‌డ ఒంట‌రిగా పోటీ చేసినా.. జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్తాన‌ని చెప్పిన కేసీఆర్‌.. ఎన్నిక‌ల‌ షెడ్యూల్ వెలువ‌డి.. రోజులు గ‌డుస్తున్నా.. ఇక్క‌డే ఉంటున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా మ‌హాఘ‌ట్బంధ‌న్ మాటే ఎత్త‌డం లేదు. చివ‌ర‌కు ఏపీలో కాంగ్రెస్‌తో కూడా పొత్తు పెట్టుకోవ‌డం లేదు. మొద‌టిసారిగా ఒంట‌రి పోరాటం చేస్తున్నారు. మ‌హాఘ‌ట్బంధ‌న్ లోని మ‌మ‌తా బెన‌ర్జీ.. ప‌శ్చిమ బెంగాల్లో ఒంట‌రి పోరే. కాంగ్రెస్‌ను కాద‌ని ఎస్‌పీ, బీఎస్పీ జ‌ట్టుక‌ట్టి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో పోటీ చేస్తున్నాయి. ఢిల్లీలో ఆప్ ఒంట‌రిగానే పోటీ చేస్తోంది. ఎవ‌రికి వారు పోటీ చేస్తున్న‌ప్పుడు ఇక ఫ్రంట్ ఊసెక్క‌డిది. చ‌క్రం తిప్పేదెక్క‌డిదీ. బీజేపోళ్లు చెబుతున్న‌ట్టు బొంగ‌రాలు కూడా తిప్ప‌లేరేమో.? ఇంత‌కీ ప్ర‌స్తావ‌న ఎందుకొచ్చింద‌టే.. బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ చ‌క్రం కాదు బొంగ‌రాలు కూడా తిప్ప‌లేరంటూ వ్యాఖ్యానించారు. 15 ఎంపీ సీట్లు చేతిలో పెట్టుకొని నాలుగున్న‌రేళ్ల‌లో తిప్పిందేమిటీ..? అంటూ కేసీఆర్‌ను ఎట‌కారం చేశారు. చ‌క్రాలు కాదు క‌దా..? బొంగ‌రాలు కూడా తిప్ప‌లేరంటున్నారు. ల‌క్ష్మ‌న్ సాబ్ మీకు పూర్తి మెజారిటీ వ‌స్తే..బొంగరం తిప్ప‌లేరేమో.. కానీ అధికారానికి ఆమ‌డ దూరం నిల‌బ‌డ్డ‌ప్పుడు చ‌క్రాలు కాదు. ఏదైనా తిప్పుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here