Home breaking news Lokesh New Comments |నేను గెలుస్తానో.. లేదో- లోకేష్

Lokesh New Comments |నేను గెలుస్తానో.. లేదో- లోకేష్

146
0

రాజకీయాల్లో తలపండిన మేధావులు, అపర చాణక్యులు ఉంటారు. వీళ్లు రాజకీయాలు శాసిస్తారు. వీరితో పాటు మరికొందరూ ఉంటారు. తండ్రి చాటు బిడ్డలుగా ఉంటూ అమాంతం రాజకీయాల్లోకి వచేస్తారు. తండ్రి రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి కొడుకును తప్పనిసరిగా గౌరవిస్తారు. తండ్రి పేరుతో రాజకీయాల్లోకి వచ్చిన వారు ఇప్పుడు దేశంలో చాలా మంది ఉన్నారు. ఈ జాబితాలోకి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంతానం కూడా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి
కేసీఆర్ కొడుకు కేటీఆర్, కూతురు కవిత, ఏపీ ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ బాబు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి సంతానం తన ప్రతిభ నిరూపించుకున్నారు. ఇక లోకేష్ బాబే.. ఆయన కూడా తన ప్రతిభ నిరూపించున్నారని టీడీపీ నాయకులు అంటారు కానీ.. ఆయన మాటల తడబాటు చూస్తే ఎక్కడో రవ్వంత అనుమానం తలెత్తుతుంది. ఇందుకు గతంలో అనేక సందర్భాల్లో ఆయన తడబాట్లు పట్టిస్తాయి. సరే ఇదంత ఎందుకుగాని తాజాగా ఆయన మరోసారి తాను పోటీ చేస్తున్న మంగళగిరిలోనే తడబడ్డారు. తన ప్రసంగంలో తత్తరపాటు పడ్డారు. టికెట్‌ ఆశించిన పార్టీ నాయకుడు గంజి చిరంజీవిని బుజ్జగించడానికి వచ్చిన లోకేష్‌ విలేకరులతో మాట్లాడుతూ..1980వ సంవత్సరం నుంచి మంగళగిరిలో టీడీపీ గెలవలేదని.. నేను గెలవాలో లేదో ప్రజలే నిర్ణయిస్తారంటూ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా అందరూ పరేషాన్ అయ్యారు. అసలు విషయమేమిటంటే 1980లో తెలుగుదేశం పార్టీయే స్థాపించలేదు. వాస్తవానికి ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించింది 1982లో కాగా 1980 సంవత్సరం నుంచే మంగళగిరిలో టీడీపీ గెలవలేదన్తి ఆయన వ్యాఖ్యానించారు. పైగా తన గెలుపు మీద తానే లోకేష్ అనుమాన పడుతున్నట్టున్నారు. అందుకే నేను గెలుస్తానో లేదో ప్రజలే నిర్ణయించాలి అని వ్యాఖ్యానించారు. దీంతో పార్టీ నాయకులతో పాటు టీడీపీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే ఆయన ప్రతిభ పార్టీ నాయకులకు తెలుసు కాబట్టి అంత సీరియస్ గా తీసుకోలేదని అంటున్నారు. లోకేష్ గెలుస్తారా లేదా అన్నది భవిష్యత్ లో తేలుతుంది. గెలవకున్నా నష్టం లేదు. ఎమ్మెల్సీ ఎలాగూ ఉందిగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here