Home breaking news kcr vs babu | కేసీఆర్ ఖ‌బ‌ర్దార్‌- చంద్ర‌బాబు

kcr vs babu | కేసీఆర్ ఖ‌బ‌ర్దార్‌- చంద్ర‌బాబు

130
0

చిత్తూరుః తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి చంద్ర‌బాబు తీవ్ర ప‌ద‌జాలంతో హెచ్చ‌రించారు. జాగ్ర‌త్త‌గా ఉండు ఖ‌బర్దార్ అంటూ హెచ్చ‌రించారు. ‘ఖబడ్దార్ కేసీఆర్.. జాగ్రత్తగా ఉండు. వైసీపీని అడ్డుపెట్టుకుని మా జోలికొస్తే ఊరుకునేది లేదు’ అని హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరులో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకొని మాట్లాడారు. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీతో మ‌న‌కు పోటీ లేద‌ని, టీఆర్ఎస్‌తోనే పోటీ అని తెలిపారు. వైసీపీకి ఓటేస్తే అది కేసీఆర్‌కు వేసినట్లేనని అన్నారు. మ‌న రాష్ట్రానికి కేసీఆర్ ఎంతో అన్యాయం చేశారని ఆరోపించారు. 60 ఏళ్ల కష్టాన్ని దోచుకుని ఆంధ్రులను అవమానించారని తెలిపారు. వైసీపీ నేతలు మోదీకి ఊడిగం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ గెలిస్తే రాష్ట్రంలో రక్షణ ఉండదని ఇది ప్ర‌జ‌లు గుర్తుంచుకోవాల‌ని సూచించారు. 2014లో కాంగ్రెస్‌కు పట్టిన గతే ఇప్పుడు వైసీపీకి ప‌ట్టించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

ఖ‌బ‌ర్దార్ అక్క‌డుంది.. ఇక్క‌డ లేదు

మ‌న ఘ‌న‌త వ‌హించిన ప‌త్రిక‌ల్లో వార్త‌ల కోత మాత్రం న‌డుస్తునే ఉంది. కేసీఆర్‌ను ఉద్దేశించి చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు ఏపీ ఎడిష‌న‌ల్ మాత్రం చేసిన‌వి చేసిన‌ట్టుగా వ‌స్తున్నాయి. తెలంగాణ‌లో మాత్రం కొన్ని వ్యాఖ్య‌ల‌ను ఎడిట్ చేసి ప్రచురిస్తున్నారు. మీరే చూడండి ఒకే ప‌త్రిక ఏపీ, తెలంగాణ ఎడిష‌న్ల‌లో ఏ విధంగా క‌వ‌ర్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here