Home తాజా వార్తలు Kcr Please | కేసీఆర్ ప్లీజ్‌

Kcr Please | కేసీఆర్ ప్లీజ్‌

123
0

సమాజంలో కొందరికి తిట్టడం అలవాటు. మరికొందరికీ తిట్టించుకోవడం అలవాటు. అలాగే కొందరికి కొట్టడం అలవాటు.. మరికొందరికి దెబ్బలు పడడం అలవాటు. ఇందులో ఇంకో రకం జనాలున్నారు. కావాలని తగవు పడి దెబ్బలు పడడం. అవతలి వాడిని కావాలని గిచ్చి తిట్లు పడడం వీళ్లకు అలవాటు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కావాలని మూడో రకం మార్గాన్ని ఎంచుకున్నట్టు కనపడుతోంది. ఎట్లయినా సరే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి వెంటే తిట్టిచ్చుకోవాలని ఆరాట పడుతునట్టుగా కనబడుతోంది.  ఎందుకన్న ప్రశ్న ఇక్కడ తలెత్తడం సహజమే. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్నికల్లో ఏనాడు ఒంటరిగా పోటీ చేయలేదు. ఒకసారి ఎన్టీఆర్ చేతుల్లోంచి ముఖ్యమంత్రి పదవి లాక్కున్నారు. 1999 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కుదుర్చుకొని.. ముఖ్యమంత్రి అయ్యారు. 2004, 2009 ఎన్నికల్లోనూ పొత్తు కుదుర్చుకొని పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కుదుర్చుకొని గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకోవడానికి చివరకు వామపక్ష పార్టీలు కూడా ముందుకు రాలేదు. ఈ పరిణామాలతో చంద్రబాబుకు అసహనం పెరిగిపోయింది. ఇదే సమయంలో డేటా కుంభకోణం బయటపడింది. ఈ అంశంపై ఫిర్యాదు రావడంతో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడం సిట్ కు అప్పగించడం వేగంగా జరిగి పోయాయి. ఈ సిట్ కు సమర్థుడిగా పేరున్న స్టీఫెన్ రవీంద్రకు అప్పగించారు.  అప్పటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు  ఆంధ్ర ఆత్మ గౌరవం దెబ్బ తెస్తున్నారంటూచంద్రబాబు సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు. చంద్రబాబును ఎప్పుడు ఏటకారం చేసే కేసీఆర్..  ఆయన ఎన్ని సవాళ్లు విసురుతున్న సప్పుడు చేయడం లేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్ మాత్రమే కౌంటర్ ఇస్తున్నారు. డేటా కుంభకోణానికి ఆంధ్ర ఆత్మ గౌరవానికి సంబంధ మేమిటో ఓ పట్టాన జనాలకు ముందు అర్థం కాలేదు. అర్థమైన తరవాత చంద్రబాబు బలహీనత ఏమిటో అర్థమై పోయింది. మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే పొత్తులు కావాలి. ఆయనతో కలవడానికి ఏ పార్టీ సిద్ధంగా లేదు. ఇప్పుడు చంద్రబాబు ముందున్న ఏకైక మార్గం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. చంద్రబాబును తిట్టాలి. ఏపీ ఎన్నికల్లో జగన్ తరుపున కేసీఆర్ ప్రచారం చేయాలి. అప్పుడు ఆంధ్ర ఆత్మ గౌరవాన్ని రెచ్చ గొట్టాలి. ఈ లెక్కన గెలుపొందాలి. అందుకే కేసీఆర్ ను రెచ్చగొట్టి.. తద్వారా ఆయన రెచ్చిపోయి చంద్రబాబును తిట్టాలి. దీని కోసం చంద్రబాబు అండ్ కో పడరాని పాట్లు పడుతున్నారు. ఆయినా కేసీఆర్ స్పందించడం లేదు. ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చింది. బాబు గోరు సవాళ్లు విసిరినా కేసీఆర్ స్పందించడం లేదు. బాబు గోరికి అసహనం పెరిగి పోయింది. ఇక టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు రంగంలోకి..దిగి జనాలు ఎప్పుడో మరిచి పోయిన బహిరంగ లేఖ ప్రయోగం చేసి.. కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఇక మొదలైంది ఛానళ్ల హడావుడి. లేఖ.. లేఖ.. లేఖ అంటూ తెగ తిప్పేస్తున్నారు స్క్రోలింగ్ లు. చంద్రబాబు సవాల్ కే స్పందించని కేసీఆర్.. కళా రాసిన లేఖకు సందిస్తారా. ? చూడాలి. సరే ఈ కతను ఓ చిన్న కథ చెప్పి ముగిస్తా. ఒకింట్లో పెండ్లాం, మొగడు ఎప్పుడు కొట్లాడుకుంటరు. పెండ్లాం తిట్టడం.. మొగడు కోపంతో కొట్టడం రోజూ జరిగేది. ఏమైందో తెలియదు. ఓనాడు మొగడు కామ్ గా వచ్చి పడుకున్నడు. పెండ్లాం ఎంత తిట్టినా సప్పుడు చేయకుండ ఉన్నడు. తిక్కరేగిన పెండ్లాం ఇంటి బయటకు వచ్చి తిడుతోంది. అలిసిపోయి ఏడుపు మొదలు పెట్టింది. పక్కింటాయిన పెండ్లాం వచ్చి ఏమైంది ఎడుస్తున్నావంటే.. ఏడుపాపి.. నేను ఎంత తిట్టిన నా మొగడు కొట్టడం లేదని చెప్పింది. రోజూ కొట్టే మొగడు కొట్టకుంటే.. నా వీపు దురద పెట్టదా. అంటూ శోకం కొనసాగించింది.. ఎదురింటాయన పెండ్లాం తెల్ల మొఖమేసుకోని నిలబడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here