Home తాజా వార్తలు Federal Front | పీఎం కుర్సీలో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌

Federal Front | పీఎం కుర్సీలో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌

224
0

అది 2019 మే 23. ఎన్నికల రిజల్ట్ వచ్చే దినం. పొద్దుగాల్నే లేసుడు లేసుడుతోనే దబ్బ దబ్బ మొకం కడుక్కొని ఇంత ఛాయ సుక్క టీవీ కాడ కూసున్న. ఏ టీవీ సూడాలన్న దానిపై కిందా మీద పడి. ఇంగ్లీష్ టీవీ పెట్టిన. మైకు చేతుల పట్టుకున్న యాంకరమ్మ చెప్పిన ముచ్చటే చెప్పి కెమెరామెన్ తో నేను అని పేరు చెప్పుకొచ్చింది. టీవీల ఏ పార్టీ ఎన్ని సీట్లలో గెలిచింది. మెజారిటీ, ముందుకు పోతున్న సీట్ల నంబర్లు ఇస్తున్నరు. ఇగ కొందరు ఎన్డీఏ(బీజేపీ), కొందరు యూపీఏ(కాంగ్రెస్) అంటున్నరు కదా అని కిందికి మీదికి ఈ రెండు పేర్లు కనబడ్తలేవు. పరేషానయితి. లోకం దద్దరిల్లేతట్టు ఫెడరల్ ప్రంట్ అని టీవీ మొత్తం కనబడబట్టే. పరీక్షల రిజల్ట్ వచ్చినప్పుడు.. ప్రయివేటు కాలేజీలు ఇచ్చే యాడ్స్ లెక్క నంబర్లు ఒకటే వస్తున్నయి. 100.. 150.. 200..250 ఇట్ల నంబర్లు వస్తానే ఉన్నాయ్. పక్కన కేసీఆర్ పాత వీడియోలు పెట్టి సక్సెస్ ఫుల్ లీడర్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటూ చెబుతున్నరు. మోదీ, రాహుల్ బొమ్మేడా కబడటలే. తెలంగాణ భవన్ కాన్నయితే గులాల్ చల్లుకుంటున్నరు. లొల్లి లొల్లి గున్నది. టప్ న కరెంటు పోయింది. టీవీ బందయింది. చెమటలు కారిపోతున్నాయి. కరెంటోళ్లను తిట్టుకుంటూ కోపంతోటి లేచిన. సుస్తే నేనేమో మంచం మీదున్న అంగంత తడిసిపోయింది. ఎదురుంగ క్యాలెండర్ల ఇయ్యాటి తారీఖు నంబర్ పెద్దగా కనిపించే. అబ్బ ఇప్పటిదాకా కల కన్ననా..? అప్పుడు గుర్తొచ్చింది రాత్రి కేసీఆర్ మాటలిన్న. గందుకే ఫెడరల్ ప్రంట్ కలొచ్చిందని నవ్వుకున్న.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here