Home breaking news child sex abuse scandal |చిన్నారుల‌పై మ‌తాధికారుల లైంగిక‌దాడి

child sex abuse scandal |చిన్నారుల‌పై మ‌తాధికారుల లైంగిక‌దాడి

175
0

చర్చిల్లో చిన్న పిల్లలపై మతాధికారులు జరుపుతున్న లైంగిక దాడులపై జర్మనీ క్యాతలిక్ చర్చ్ ఆందోళన వ్యక్తం చేసింది. అనేకమంది మతాధికారులు చర్చ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని తెలిపింది. సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. చిన్నారులపై లైంగిక దాడుల అంశంపై నాలుగు రోజులుగా జర్మనీలోని వెస్ట్రన్ సిటీలో జరుగుతున్న జర్మన్ బిషప్ కాన్ఫరెన్స్ లో చర్చించారు. లైంగిక దాడులపై అనంతరం ఈ కాన్ఫరెన్స్ కు అధ్యక్షత వహించిన కార్డినల్ రినార్డ్ మార్క్స్ మీడియాతో మాట్లాడారు. ఆయన తెలిసిన ప్రకారం ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ లోని పలు చర్చ్ లోని మతాధికారులు.. లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులపై 23 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న జర్మనీ క్యాతలిక్ క్షమాపణ కోరింది. ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని పేర్కొంది.

జర్మని చర్చ్ గత సెప్టెంబర్ లో వెల్లడించిన వివరాల ప్రకారం 1670.మంది మతాధికారులు చర్చ్ నిబంధనలను ఉల్లంఘించి 1946 నుంచి 2014 వరకూ 13 ఏళ్ల వయసులోపు ఉన్న 3677 మంది మైనర్ల (బాలురు)పై లైంగిక దాడులకు పాల్పడ్డారు. అయితే బాధిత బాలుర సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉంటుందని ప్రచారంలో ఉంది. కొన్ని ఒత్తిడుల కారణంగా సంఖ్యను కుదించారన్న విమర్శలున్నాయి. గత నెలలో జరిగిన వాటికన్ సమావేశంలో చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులపై చర్చించారు. ఇటువంటి ఘటనలను జరగకుండా చర్యలు తీసుకోవాలన్న ఒత్తిడి తెచ్చారు.

ఇద్దరు బాలురపై లైంగిక దాడికి పాల్పడిన మతాధికారికి గతంలో ఆరేళ్ళ జైలు శిక్ష విధించిన సంగతి ప్రస్తావనకు వచ్చింది. కాగా లైంగిక దాడుల అంశంపై జర్మనీ బిషప్స్ గతంలోనే చర్చించారు. మహిళల ఎలా వ్యవహరించాలో మతాధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు. చర్చ్ కూడా 1900 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. బాధితులకు సాంత్వన చేకూర్చేలా ఇండిపెండెంట్ నిపుణులతో వేగవంతంగా విచారణ జరిపించడంతో పాటు.. పరిహారం అందించెందుకు చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాగా లైంగిక దాడులను నిరసిస్తూ జర్మనీ ఉమెన్ క్యాతలిక్ కు చెందిన 300 మంది ఆందోళ‌నకారులు బిషప్ కాన్ఫరెన్స్ జరుగుతున్న ప్రదేశం వద్ద టార్చ్ లైట్లను ఆన్ చేసిప్రదర్శన నిర్వహించారు. చర్చ్ లో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ 30 వేల సంతకాలను సేకరించారు. కాగా జర్మనీలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన బెర్లిన్ స్కూల్ లో 500 మంది బాలురు లైంగిక దాడులకు గురయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here