Home breaking news Bjp Telangana List | బీజేపీ జాబితా ఇదే

Bjp Telangana List | బీజేపీ జాబితా ఇదే

128
0

బీజేపీ తెలంగాణ ఎంపీ అభ్య‌ర్థుల జాబితా దాదాపు ఖరారైంది. ఇందులో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాన్ని మిన‌హాయించారు. ఈ స్థానంలో శాంత కుమార్ కు సీటు కేటాయించినా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి డీకే అరుణ నుంచి సంకేతాలు రావడంతో ఆమెకే ఈ సీటు కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ స్థానాన్ని ప‌క్క‌కు పెట్టారు. సోయం బాపూరావు చేర‌డంతో ఆదిలాబాద్ టికెట్ ఆయ‌న‌కు కేటాయించారు. అయితే ఈ జాబితాలో ఉన్న పేర్లు య‌ధాత‌థంగా వ‌స్తాయ‌న్న అంశంపై పూర్తి స్ప‌ష్ట‌త లేదు. పెద్ద త‌ల‌కాయ‌లు, హామీలు వ‌స్తే పేర్లు మారిపోతాయి.
అభ్య‌ర్థుల పేర్లు
హైద‌రాబాద్ః అమ‌ర్‌సింగ్‌
సికింద్రాబాద్ః కిష‌న్‌రెడ్డి
మ‌ల్కాజ్‌గిరిః ఎన్ రాంచంద‌ర్‌రావు
చేవెళ్లః నంద‌కుమార్ యాద‌వ్‌
భువ‌న‌గిరిః పీవీ శ్యాంసుంద‌ర్‌రావు
న‌ల్గొండః జితేంద‌ర్ గుప్త‌
వ‌రంగ‌ల్ః చింతా సాంబ‌మూర్తి
మ‌హబూబాబాద్ః హుస్సేన్ నాయ‌క్‌
ఖ‌మ్మంః వాసుదేవ‌రావు
పెద్ద‌ప‌ల్లిః ఎస్ కుమార్‌
క‌రీంన‌గ‌ర్ః బండి సంజ‌య్‌
నిజామాబాద్ః అరవింద్‌
ఆదిలాబాద్ః సోయం బాపూరావు
మెద‌క్ః ర‌ఘునంద‌న్‌రావు
నాగ‌ర్ క‌ర్నూల్ః బంగారు శృతి
జ‌హిరాబాద్ః బాణాల ల‌క్ష్మారెడ్డి
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ః శాంత‌కుమార్ (ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న‌పేరు ఇది ప్ర‌ముఖ వ్య‌క్తి వ‌స్తే మారుతుంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here