Home breaking news Bjp List | అద్వానీకి No.. షాకు S – బీజేపీ తొలిజాబితా విడుద‌ల‌

Bjp List | అద్వానీకి No.. షాకు S – బీజేపీ తొలిజాబితా విడుద‌ల‌

163
0

బీజేపీ నేత‌ల ఎదురుచూపు, ప‌క్క పార్టీల ఎదురుచూపుల‌కు ఎట్ట‌కేల‌కు తెర‌దించుతూ బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం తొలి జాబితా విడుద‌ల చేసింది. ఈ జాబితాలో పార్టీ ఆవిర్భావంలో తొలిపాత్ర పోషించిన అద్వానీ టికెట్ కేటాయించ‌లేదు. ఆయ‌న ప్ర‌స్తుతం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గాంధీన‌గ‌ర్‌లో పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు కేటాయించింది. తెలంగాణ‌లో గురువుకు టికెట్ నిరాక‌రించి.. శిష్యుడికి కేటాయించింది. చేరిన ఒక్క రోజులోనే మ‌రొక‌రికి టికెట్ కేటాయించింది. తెలంగాణ తొలి జాబితాలో చోటు చేసుకున్న చిత్రం ఇదే. సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ బండారు ద‌త్తాత్రేయ‌కు జాతీయ నాయ‌క‌త్వం టికెట్ నిరాక‌రించింది.

ఆ స్థానంలో ద‌త్త‌న్న శిష్యుడు కిష‌న్‌రెడ్డికి టికెట్ కేటాయించింది. తెలంగాణ‌, ఏపీకి సంబంధించిన బీజేపీ అభ్య‌ర్థుల తొలిజాబితా జాతీయ నాయ‌క‌త్వం విడుద‌ల చేసింది. ఏపీకి సంబంధించి 12 మంది, తెలంగాణకు సంబంధించి 10 మంది అభ్యర్థులతో కూడిన జాబితా విడుదల చేసింది. పార్టీలో చేరిన ఒక్క‌రోజుకే డీకే అరుణకు మహబూబ్‌నగర్‌ సీటు కేటాయించింది. పార్టీ మాజీ జాతీయ అధ్య‌క్షుడు బంగారు లక్ష్మణ్‌ కుమార్తె బంగారు శృతికి నాగర్ కర్నూల్ స్థానం కేటాయించారు

https://www.facebook.com/BJP4India/videos/1177713172397884/

తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు

సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి
మల్కాజిగిరి – రామచంద్రరావు
కరీంనగర్ – బండి సంజయ్
నిజామాబాద్ – ధ‌ర్మ‌పురి అరవింద్
వరంగల్ – చింత సాంబమూర్తి
మహబూబ్ నగర్ – డీకే అరుణ
భువనగిరి – శ్యాం సుందర్ రావు
నాగర్ కర్నూల్ – బంగారు శృతి
నల్గొండ – గార్లపాటి జితేందర్‌ రెడ్డి
మహాబూబాబాద్‌ – జాటోతు హుస్సేన్‌ నాయక్‌

ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థులు

విశాఖపట్నం – దగ్గుబాటి పురందేశ్వరి
నరసరావుపేట- కన్నా లక్ష్మీనారాయణ
నరసాపురం – పైడికొండల మాణిక్యాలరావు
ఏలూరు – చిన్నం రామకోటయ్య
హిందూపురం – పార్థసారధి
విజయనగరం – సన్యాసిరాజు
నెల్లూరు – సురేష్‌రెడ్డి
కర్నూలు – పీవీ పార్థసారధి
అనంతపురం – చిరంజీవిరెడ్డి
తిరుపతి – హరిరావు
నంద్యాల – ఆదినారాయణ
గుంటూరు – జయప్రకాశ్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here