Home breaking news Bjp comments on kcr | కేసీఆర్ ఓ బోడిలింగం

Bjp comments on kcr | కేసీఆర్ ఓ బోడిలింగం

492
1

హైదరాబాద్ : శతకోటి లింగాల్లో కేసీఆర్ ఓ బోడి లింగం బీజేపీ అధ్యక్షుడు కే లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. 16 ఎంపీలు గెలిపిస్తే ఏం చేస్తావని నిలదీశారు. మొన్నటి వరకు నీకు, నీ మిత్రపక్షమైన ఎం ఐ ఎంకు కలిపి 16 మంది ఎంపీలు ఉంటే చేసిందేముందని ఆయన ప్రశ్నించారు. వైమానిక దాడులు చేసిన సైనికులను అవమాన పర్చిన కేసీఆర్‌ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుస్తామో చెప్పడానికి తాను జ్యోతిష్కుడిని కాదన్నారు. కచ్చితంగా అత్యధిక స్థానాలు గెలుస్తామని, ఓటింగ్‌ శాతం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 1న జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారని తెలిపారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here