Home రివ్యూస్ అందం కోసం పందెం (1971) -Andham kosam Pandem

అందం కోసం పందెం (1971) -Andham kosam Pandem

486
0
ఫొటో: ఇంటర్​నెట్​ నుంచి

తెలుగు సినిమా రంగంలో ప్రయోగాలకు కొదవలేదు. గ్రాఫిక్స్​ రాని రోజుల్లోనే.. ఆ తరహా సన్నివేశాలు కొన్ని సినిమాల్లో ఉన్నాయి. ఇలాంటి సన్నివేశాలు తీయడంలో బీ విఠలాచార్య ఎక్స్​ఫర్ట్​. ఇప్పుడు మనం ప్రస్తావించుకునేదీ దర్శకుడు ఆమంచర్ల శేషగిరిరావు గురించి. ఈయన దర్శకత్వంలో కాంతారావు, రాజనాల, కాంచన, రాజబాబు, భారతి, జ్యోతిలక్ష్మి ప్రధాన పాత్రదారులుగా నటించిన ‘అందం కోసం పందెం’ 09 డిసెంబర్​ 1971లో విడుదలైంది. హృషీకేస్​ పిక్ఛర్స్​ నిర్మించిన ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు గ్రాఫిక్స్​ తరహాలో ఉన్నాయి. ముందుగా సినిమా కథ గురించి.. మాధవుడు(కాంతారావు), శాంబరుడు(రాజనాల) చిన్ననాటి స్నేహితులు. వీళ్లింద్దరు చిన్నతనంలో ఫ్రెండ్స్​తో కలిసి బిళ్ళంగోడు ఆడుతూ ఉంటారు. అదే సమయంలో ఆ వైపే వస్తున్న యువరాజు(రాజబాబు)కు బిళ్ళ తగిలి గాయపడతాడు. ఈ సంఘటనపై మహారాజు(మిక్కిలినేని) వారిరువురినీ కఠినంగా శిక్షిస్తాడు. ఇద్దరికీ మహారాజుపైన, యువరాజు పైన ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో వెళ్లిపోతారు.

రాజనాల మాంత్రికుడు త్యాగరాజును ఆశ్రయించి మంత్ర విద్యలన్నీ నేర్చుకుంటాడు. కాంతారావు మాత్రం తన తల్లి దగ్గరే అన్ని విద్యలూ నేర్చుకుంటాడు. ఆస్థానంలో నిర్వహించిన  సాహిత్య, సాహస పోటీలలో గెలిచి శభాష్​ అనిపించుకుంటాడు కాంతారావు. అతడి శూరత్వానికీ, పాండిత్యానికి ఆకర్షింపబడిన మహారాజు మేనకోడలు మాలతి(కాంచన).. కాంతారావును ప్రేమిస్తుంది. అయితే రాజబాబు.. ఆమెను బలవంతంగానైనా పెళ్ళాడేందుకు నిశ్చయిస్తాడు. మాయలు.. మంత్రాలు నేర్చిన రాజనాల.. చంద్రలోకానికి చెందిన జ్యోతిలక్ష్మి కోసం మంత్ర విద్యలు నేర్పిన గురువునే చంపేస్తాడు. జ్యోతిలక్ష్మిని తన వసం చేసుకుంటాడు. మహారాజును, యువరాజును అవమానించడంతో పాటు కాంచనను వసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. స్నేహితుడు కాంతారావు ప్రేమించాడని తెలిసి కూడా కాంచనను చేపడుతానని ప్రతిన బూనుతాడు. స్నేహితుల మధ్య వైరం ప్రారంభమౌతుంది. ఆ అమ్మాయి అందం పొందడం కోసం పందెం వేస్తారు. ఇందులో చివరకు కాంతారావు నెగ్గుతాడు. ఈ సినిమాలో పాటలు, పద్యాలు కలిపి 19 ఉన్నాయి.

గ్రాఫిక్​ తరహాలో సన్నివేశాలు

చంద్రలోకం నుంచి భూలోకానికి వచ్చిన జ్యోతిలక్ష్మి ‘సూట్​’ వేసుకోవడం.. విప్పే సన్నివేశాలు గ్రాఫిక్​ తరహాలోనే ఉంటాయి. చంద్రలోకానికి వెళ్లిన కాంతారావు.. ‘ కన్యల కాళ్లను చూపించి.. ఎవరు అందగత్తో ’ నిర్ణయించే సీన్​.. వహ్హా అనేట్టు ఉంటుంది. ఈ సీన్​లో అమ్మాయిల నడుము వరకే చూపించి.. పైనే వేరే సీన్​ ఉండే విధంగా ఉంటుంది. దీన్ని చూస్తే మనం ఆశ్చర్యపోతాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here