Home breaking news చైనాకు ప్రపంచం రుణపడి ఉండాలట

చైనాకు ప్రపంచం రుణపడి ఉండాలట

817
0
ఫొటో: ఇంటర్​నెట్​ నుంచి

పుట్టిన దేశం నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లినా.. మాతృదేశానికి రుణ పడి ఉంటారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు.. పుట్టిన దేశానికే మద్దతుగా నిలబడుతుంటారు. కానీ భారతీయ  లెఫ్టిస్టులు మాత్రం.. తమ పుట్టిన దేశానికి మద్దతు ఇవ్వరు. చైనాకు మద్దతుగా నిలుస్తారు. అది ఏదైనా కానీ. అరుణాచల్​ ప్రదేశ్​లో చైనా అడుగు పెడితే.. చప్పుడు చేయరు. మాట్లాడినా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోండి అంటారు. చైనా వాళ్లు భారత సైనికులను చంపితే.. లెఫ్టిస్ట్​ మీడియాలో ఎక్కడో చిన్నగా ప్రాధాన్యం లేకుండా వార్త వేస్తారు. కరోనా వైరస్​పై ప్రపంచమంతా.. చైనాను వేలెత్తి చూపితే.. వీళ్లు మాత్రం ‘ప్రపంచమంతా చైనాకు రుణపడి ఉండాలి’ అన్న  వ్యాసాన్ని తెలుగులో అనువాదం చేసి తమ గ్రూపుల్లో పోస్టులు చేస్తారు. ఆగస్టు2020 లో  చైనా జర్నలిస్టు బో ఫెర్లింగ్, తమ దేశపు పత్రిక ‘పీపుల్స్​ డైలీ’కి ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం హెడ్డింగ్​ ‘చైనాకు ప్రపంచం రుణపడి ఉండాలి’ అని ఉంది. ఈ వ్యాసాన్ని భారత్​లోని ఇంగ్లిష్​ పక్షపత్రిక  ‘ఫ్రంట్​లైన్​’ ప్రచురించింది. ఈ వ్యాసాన్ని మార్కిస్ట్​ వీర భక్తుడు తెలుగులో అనువదించి (ఏదైనా పత్రికల్లో వచ్చిందో తెలీదు)  లెఫ్టిస్ట్​ గ్రూపుల్లో పోస్ట్​ చేశారు.     

ఆ వ్యాసం ఇలా సాగిపోయింది

‘చైనా, కరోనా వైరస్‌పై యుద్ధానికి తన దగ్గర ఉన్న అన్ని వనరులను పోగుచేసుకున్నది. ఇతర దేశాలకు మందులు సరఫరా చేయడమే కాకుండా నిపుణులైన డాక్టర్లను పంపించి వీటితో పాటు తను సమకూర్చుకుని వైద్య అనుభవాన్ని కూడా పారదర్శకంగా ఇతరులకు పంచుతున్నది.

ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారి అని అధికారికంగా ప్రకటించడంతో ఇది చైనా చేసిన పాపం అనే విమర్శల దుమారం లేసింది. ప్రారంభ దశలోనే వైరస్‌ గురించిన మరింత సమాచారం, వైరస్‌ యొక్క పుట్టుక ఎక్కడ జరిగిందనే అంశం వెల్లడించి ఉండాల్సిందనే విమర్శ ఉన్నది. చైనా ప్రభుత్వం సమాచారాన్ని రహస్యంగా అట్టిపెట్టినట్టు విమర్శ వచ్చింది.

ఏప్రిల్‌ మొదటివారం నాటికి కరోనా 114 దేశాలలో 1,10,000 మందికి సోకింది. 8,000 మంది ప్రాణాలను బలికొన్నది. వైరస్‌ని నిరోధించటానికి, నివారణకు చైనా భారీ వ్యయ ప్రయాసలను భరిస్తూ కఠినమైన చర్యలు చేపట్టిందని డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసించింది. అందుకోసం 60రోజులు పగలు రాత్రనక వైరస్‌కు వ్యతిరేకంగా యుద్ధం సాగింది. ఇందులో 340 వైద్య బృందాలు, 42,000లకు మించి ఆరోగ్య కార్యకర్తలు అకుంటిత దీక్షతో కుటుంబాలకు దూరంగా ఉంటూ కృషి చేసారు. విధినిర్వహణలోనే 46మంది చనిపోవడం, 1,716మందికి వ్యాధిసోకడం జరిగింది. వైరస్‌ వ్యాప్తికి కేంద్ర బిందువైన వుహాన్‌ ప్రాంతాన్ని జనవరి 23 నుంచి లాక్‌డౌన్‌ చేశారు. హుబీ ప్రాంతంలో దాదాపు 6కోట్లమంది బయటకు రాకుండా పరిమితులు విధించారు. వారి త్యాగాలను చూసిన తరువాత వారు కుట్రచేసారు అనే ఆరోపణలు అర్థరహితం అని తేలిపోయింది.

చైనా రెండు నెలల కాలంలో ప్రపంచానికి మహమ్మారి యొక్క వ్యాప్తి వేగాన్ని ఎలా తగ్గించవచ్చో చేసి చూపించింది. మాస్కులు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం, ప్రజలు గుమికూడటాన్ని అరికట్టడం ద్వారా వ్యాప్తిని నియంత్రించవచ్చని నిరూపించింది. జనవరి 7న చైనా వైరెస్‌ జన్యు పటాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియచేసింది. మహమ్మారి నియంత్రణకు తను పాటించిన వివరాలను చైనా ఇప్పటికే 100దేశాలతో 10 అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థలతో పంచుకున్నది. చైనా జాతీయ ఆరోగ్య సంస్థకు చెందిన ఉన్నత స్థాయి నిపుణుల బృందం నాయకుడు జోనగ నాస్‌శాన్‌ ఇతర దేశాలతో నిత్యం అందుబాటులో ఉంటూ వారు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కార మార్గాలు తెలియచేస్తున్నారు. చైనాకు ఇతర దేశాలకు మధ్య కొనసాగుతున్న సహకారానికి, సంఘీభావానికి ఇంతకన్నా ఏమి ఆధారం కావాలి.

వైరస్‌ పుట్టుక గురించి తెలుసుకోవడం అత్యంత అవసరం. ఇందులో భాగమే వ్యాక్సిన్‌ కోసం జరిగే పరిశోధనలు. హెచ్‌ఐవీ ఏ గోరిల్లా జాతి నుంచి ఏర్పడింది అనేది తెలియకపోయినా ఆ వ్యాధి సోకకుండా జాగ్రత్త పడవచ్చు. వైరస్‌ను నియంత్రించవచ్చు అనేది చైనా అనుభవం తెలియచేస్తున్నది. కాకమ్మ కబుర్లు చెప్పేవారి మాటలను నమ్మకండి. చైనా నిజాయితీగా వ్యవహరించింది అనేది సత్యం. ప్రపంచం చైనాకు రుణపడి ఉన్నది.’ ఇదండి వ్యాసంలో పేర్కొన్న సంగతి.

కరోనా వైరస్​ పుట్టింది చైనాలోని వూహాన్​లో. ఇది జగమెరిగిన సత్యం. ఆ తర్వాత ఏం జరిగిందో.. ప్రపంచానికి ఎలా అంటించిందో తెలుసు. మళ్లీ ప్రస్తావించడం అ ప్రస్తుతం. భారతదేశం నాశనమైనా.. ఈ లెఫ్టిస్టులకు పట్టదు. చైనా చక్కగా ఉంటే చాలు. ఈగ కూడా వాలనీయదు. ‘పీపుల్స్​ డైలీ’ పత్రిక వ్యాసాన్ని ప్రచురించిన ఫ్రంట్​లైన్​ పత్రిక లెఫ్టిస్ట్​ భావజాలం కలిగిన ‘ద హిందూ’ ప్రచురిస్తోంది. దాన్ని వీళ్లు తెలుగులో అందించారు. పైగా సంబుర పడిపోతున్నారు. తాము ఉండే దేశాన్ని కాకుండా చైనా విపరీతంగా భక్తి కలిగి ఉంటేనే దేశభక్తి అని ఈ లెఫ్టిస్టుల భావన. అందుకే వీరు ప్రజలకు దూరమవతున్నారు. ఈ విషయాన్ని వీళ్లు గుర్తించడం లేదు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here