Home breaking news పాశ్వాన్ అసహనంలో అర్థముంది

పాశ్వాన్ అసహనంలో అర్థముంది

307
0
ఫొటో: ఇంటర్​ నెట్​ నుంచి

తమకు ఎవరు ఇచ్చిందనేదే.. తీసుకున్న వాడు చూస్తాడు. కానీ పంపించింది.. డబ్బులు ఖర్చు పెట్టింది ఎవరని చూడరు. వారికా అవసరం లేదు కూడా. అయితే పంపించినోళ్లు కూడా తమకు కొంత ప్రచారం కావాలని కోరుకుంటారు. కానీ పంపిణి చేసినోళ్లు మాత్రం ఆ పని చేయరు. అంతా తామే చేసినట్టు చెప్పుకుంటుంటారు. విషయానికొస్తే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా  సబ్సిడీ కింద లబ్దిదారులకు కేంద్రం అందజేస్తున్న సరుకులను తామే అందిస్తున్నట్టుగా కొన్ని రాష్ట్రాలు ఫీల్​ అవుతున్నాయని  కేంద్ర ఆహారశాఖ మంత్రి రాం విలాస్‌ పాశ్వాన్​ కామెంట్​ చేశారు. తెలంగాణ సహా 11 రాష్ట్రాల్లో  కేంద్రానికి ఏ మాత్రం క్రెడిట్‌ ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్‌ షాపుల ద్వారా లబ్దిదారులకు అందించే సరుకుల్లో కిలోకు రూ.2 ధర చొప్పున బియ్యం, రూ.3 ధర చొప్పున గోధుమలను కేంద్రం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సరుకులకు సంబంధించి రాష్ట్రాలు భరించేది చాలా తక్కువే.

కేంద్రం 90శాతం సబ్సిడీని భరిస్తోంది. కేంద్రం ఇస్తున్న సబ్సిడీలను ఏ మాత్రం ప్రస్తావించకుండా క్రెడిట్‌ రాష్ట్రాలు తమ ఖాతాలోనే వెసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఛత్తీస్​గఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిసా, పశ్చిమబెంగాల్‌, కేరళ, తమిళనాడు, కర్ణాటక, త్రిపుర ఈ జాబితాలో ఉన్నాయట. ఇందులో మధ్యప్రదేశ్​, త్రిపుర, కర్ణాటక బీజేపీ రాష్ట్రాలేనాయే. తమిళనాడు మిత్రపక్షమేనాయే. అయినా పాశ్వాన్​.. వీటిపై కూడా తన ఆవేదనను వ్యక్తం చే శారు. ఇచ్చినోళ్లు కేంద్రం పేరు ఎందుకు చెబుతారు.. అన్నీ తామే ఇచ్చామని చెప్పుకుంటారు. ఇవన్నీ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలి కదా. ఇక తెలంగాణ ప్రభుత్వమైతే.. ఎక్కడ మోదీ బొమమ వేయాల్సి వస్తుందో అని.. ఆహార భద్రతా కార్డులు కూడా ఫ్రింట్​ చేయడం లేదు. ఎంతైనా పాశ్వాన్​ ఆవేదన, అసహనంలో అర్థముంది. ఇచ్చినోళ్లు కొంతైనా ప్రచారం కావాలని కోరుకోవడం న్యాయమే కదా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here