ఒక్కసారి చిన్నతనంలోకి అంటే ఇప్పుడు 20 ఏండ్లు ఉన్నవారితో పాటు ఆపై వయసున్న వాళ్లు వెళితే.. చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర వంటి కథల పుస్తకాలు గుర్తుకొస్తాయి. వాటిల్లో కథలెలా ఉంటాయంటే.. రాజుగారు.. రహస్యగూడచారులను పెట్టి రాజ్యంలో ఏం జరుగుతుంది. తనపై ఎవరన్న కుట్రలు పన్నుతున్నారా..? అని ఆరాతీస్తుంటారు. ఈ గూడచారులనే ప్రస్తుత భాషలో డిటెక్టివ్ అని సంబోధిస్తున్నాము. ప్రజెంట్‌గా కొంతమంది వ్యక్తులు పెళ్లి సంబంధాల విషయాల్లో కూడా అమ్మాయి లేదా అబ్బాయి గురించి తెలుసుకోవడానికి డిటెక్టివ్‌లను ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు విషయానికొస్తే ఏపీలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్య కార్యకర్తలు కావచ్చు ఇతరత్రా ఎవరైనా కావచ్చు. టీడీపీ ఏం చేస్తోంది అన్న విషయంలో ఆరా తీస్తున్నారు. అంటే డిటెక్టివ్‌లుగా వ్యవహరిస్తున్నారా..? అంటే అవునని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్ష టీడీపీ ఏం చేస్తోందో ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారు. అందుకే పొలిటికల్ డిటెక్టివ్ @YSR కాంగ్రెస్ అని హెడ్డింగ్ పెట్టేశాము. ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్క్షానం ఉంది కాబట్టి డిటెక్టివ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు.
సరే టీడీపీ ప్రజెంట్ లేదా మాజీ నేతలు ఏం చేస్తున్నారా..? అని ఆరాతీస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఈ నెల 13న జరిగిన ఒక భేటీకి సంబంధించిన వీడియో సంపాదించింది. దీనికి సంబంధిచిన వీడియో ‘వైఎస్సార్ డిజిటల్ మీడియా’ తన ట్విట్టర్లో పోస్ట్ చే సింది. ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, టీడీపీ సారీ ప్రస్తుత బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, బీజేపీకి చెందిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఇది జరిగింది ఈ నెల 13న హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ఫార్క్ హయాత్ హోటల్లో. బీజేపీలో ఉన్న ఎంపీ సుజనా.. చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు. మాజీమంత్రి కామినేని శ్రీనివాస్.. ఇప్పుడు రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న ప్రముఖ నేతకు సన్నిహితుడు. ఈ కారణంగానే 2014లో కామినేని బీజేపీలో చేరగానే టికెట్.. వచ్చింది. గెలవగానే టీడీపీ గవర్నమెంట్లో మంత్రి పదవి వచ్చింది. ఈ ఇద్దరితో ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ రమేశ్ సమావేశం కావడం చర్చనీయాంశమే. ఈనెల 13న ఉదయం 10:40 గంటలకు వీరి ముగ్గురి భేటీ జరిగింది. దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం సాగింది. సో వీరి ముగ్గురి మధ్య చర్చ ఏం జరిగిందో తెలియదు కానీ. చర్చనీయాంశంగా మాత్రం మారింది. ఇందుమూలంగా యావన్మంది టీడీపీ నేతలకు తెలియజేయునది ఏమనగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు అనుభవజ్ఞులైన డిటెక్ట్వ్ పాత్ర పోషిస్తున్నట్టుగా ఉంది జాగ్రత్తహో. టీవీ 9 నుంచి బయటకెళ్లిన బిత్తిరి సత్తి