ప్రధాని మోదీ విషయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్‌లోని కమ్యూనిస్టులు ఒకటే తీరుగా ఆలోచిస్తున్నట్టుగా ఉంది. సిద్దాంతాలు.. ఇతర అంశాలపై విబేధాలొండుచ్చు కానీ.. #coronaను అదుపు చేయడానికి లాక్డౌన్ విధించిన విషయంలో మాత్రం మోదీపై ఎవరూ విమర్శలు చేయడం లేదు. కానీ భారత కమ్యూనిస్టులు, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం కొత్త అర్థాలు తీస్తున్నారు. లాక్డౌన్ కారణంగా కొత్తగా ఏర్పడిన ఇబ్బందులతో మోదీ క్షమాపణ చెప్పారని, పైగా భారత్‌లో కర్ఫ్యూ ఎత్తేశారంటూ చెప్పుకొచ్చి నాలుక్కర్చుకున్నారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. కరోనా కట్టడి కోసం లాక్డౌన్ విధించి మిమ్ములను ఇబ్బంది పెడుతున్నందున తనను దేశ ప్రజలు క్షమించాలని అప్పీల్ చేసుకున్నారు. ఇంత స్పష్టంగా తాను ఎందుకు క్షమాపణ కోరుకున్నారో చెప్పిన తర్వాత కూడా అదిగో మోదీ క్షమాపణ చెప్పారని వాదన మొదలు పెట్టారు. ఈ విషయంలో ఇక్కడి కమ్యూనిస్టులు తమ సోషల్ మీడియాలో చిత్రమైన వాదన చేశారు. తప్పు చేస్తేనే కదా క్షమాపణ కోరేదీ అంటూ గుడ్డు మీద ఈకలు పీకే పని ప్రారంభించారు.
ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు. కరోనా కారణంగా లాక్డౌన్ విధించి మిమ్ములను ఇబ్బందిపెడుతున్నాను. అందుకు క్షమించండి అని. వీళ్లు మాత్రం దాన్ని పక్కన పెట్టి.. ఎందుకు క్షమించాలి.. అంటూ నోట్ల రద్దు నుంచి ఎన్నో అంశాలను ప్రస్తావిస్తూ ఇందుకు క్షమించాలా..? అందుకు క్షమించాలా..? అంటూ వాదన చేస్తున్నాయి. ఇప్పుడు పాకిస్థాన్‌లో కరోనా తీవ్రత పెరిగిపోయింది. అక్కడ లాక్డౌన్ విధించాలని అందరూ కోరుకుంటున్నారు. ఇది పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు ఇష్టం లేనట్టుంది అందుకే లాక్డౌన్ విధించినందుకే ప్రధాని మోదీ భారత ప్రజలను క్షమాపణ కోరుకున్నారని కొత్త అర్థం చెప్పారు. లాక్డౌన్ కారణంగా భారత్‌లో కొత్త సమస్యలు తలెత్తాయని చెప్పారు. అందుకే క్షమాపణ చెప్పారని తెలిపారు. పైగా కర్ఫ్చూ ఎత్తివేశారంటూ ఇమ్రాన్ చెప్పుకొచ్చారు. పాక్ మీడియా వెంటనే ఇమ్రాన్‌పై దుమ్మెత్తి పోసింది. అసలు విషయం దాచి లేని విషయాన్ని చెబుతారా..? అంటూ విరుచుకపడింది.
పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన కామెంట్ ఇది