–వికాస్ రుషి
బీజేపీ కేడర్‌లో ఎన్నడూ రాని ఆలోచన ఇప్పుడొచ్చింది. ఈ పార్టీలో సీఎం కేండిటేట్ అన్న మాటే ఏనాడు ఎవరికీ రాలేదు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడూ ఎవరితో పొత్తు పెట్టుకుందామా..? ఖర్చు లేకుండా ఓ నాలుగు సీట్లు గెలుచుకుందామా..? అన్న ఆలోచనే వచ్చేదీ. కానీ మన పార్టీ నుంచి సీఎం కేండిటేడ్ ఉన్నడన్న ఆలోచన బీజేపీ కేడర్‌లో రాలేదు. కనీసం ఆ ఆలోచన చేయడానికి కూడా ఇప్పటివరకూ ఉన్న నాయకుల్లో కలిగిందని కూడా అనుకోలేం. బీజేపీ మీదున్న ప్రేమంతో ఎవరైన విలేకరి సీఎం ఎవరవుతారంటే.. కేడర్ పెదవి విరిచేదీ. నాయకులు మాత్రం మాదీ జాతీయ పార్టీ. వాళ్లేం చెబితే అదే అంటూ కామెంట్ చేసేవారే కానీ.. నేనున్నా లైన్లో అని ఇంటర్నల్‌గా కూడా కామెంట్ చేసినోళ్లే లేరు. ఇప్పుడు లేటేస్ట్‌గా బండి సంజయ్‌కు పార్టీ పగ్గాలు అందించగానే.. సీఎం కేండిటేడ్గా పేరు తెరమీదకే వచ్చేసింది.
నిన్న పార్టీ ఆఫీస్‌లో జరిగిన కార్యక్రమంలో కాబోయే సీఎం బండి సంజయ్ అంటూ కేడర్ నినాదాలు. ఈ నినాదాలు విన్నోళ్లు.. పాత నాయకులైతే.. ముఖం నల్లబడిపోయింది. కొత్తోళ్లకయితే.. కొంత ఉత్సాహానిచ్చింది. గత నాయకుల మాదిరిగా కాకుండా బండి సంజయ్ కూడా తన 20 నిమిషాల ప్రసంగంలో కేడర్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చేట్టుగా మాట్లాడాడు. ఆ పార్టీ కార్యకర్తలకు ఏం కావాలో అవే మాట్లాడాడు. ఈ బండి సంజయ్ ఊరుకోడు. నన్నుచూస్తే చావే భయపడుతుంది నీవెంత అంటూ కేసీఆర్‌ను పూచిక పుల్లతో సమానంగా కామెంట్ చేశాడు. కేసీఆర్‌కు మనసు.. మానవత్వం లేదన్నట్టుగా పలు సంఘటనలను ఉదహరిస్తూ చేసిన కామెంట్ ‘మానవ మృగం’. ఏ సర్కారు డబ్బిచ్చినా.. అది ప్రజల డబ్బే అన్నది తనదైన బాషలో కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ నీ అబ్బ సొమ్మా అంటూ పై సంజయ్ షాకింగ్ కామెంట్లే చేశాడు. ఈ స్థాయిలో కేసీఆర్‌పై బీజేపీలో ఏ నాయకుడు కామెంట్ చేయలేదు. నిన్నటి సభలో గుక్క తిప్పుకోకుండా సంజయ్ చేసిన ప్రసంగాన్ని గమనిస్తే.. బీజేపీ జాతీయ నాయకత్వం కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నదని ఆ పార్టీ కేడర్ అనుకోవడంలో ఏ మాత్రం తడబడటం లేదని కచ్చితంగా అనుకోవచ్చు.