Home breaking news అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ’దేశభక్తి’ నగ్నత్వం క్లియర్

అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ’దేశభక్తి’ నగ్నత్వం క్లియర్

827
0
ఫొటో: ఇంటర్​నెట్​ నుంచి

–ఆదిత్య

ఎవడికి వాడు తమను మించిన దేశభక్తి ఉన్నోడు ఈ వరల్డ్​లోనే లేడని డప్పు కొట్టుకుంటారు. కొందరి డప్పు ఎక్కువ చప్పుడు చేస్తే.. ఇంకొందరి డప్పు తక్కువ చప్పుడొస్తది.  దేశభక్తి డప్పు కొట్టుకునే ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ పార్టీ నగ్నత్వం గతంలో చానాసార్లు బయటపడ్డది. సీఏఏ. ఎన్నార్సీ అంశాలపై దేశంలో ముస్లిం సంఘాల నుంచి(చే) తీవ్ర వ్యతిరేకత వస్తున్న క్రమంలో.. దాన్ని క్యాష్​ చేసుకోవడానికి అన్ని పార్టీలూ పాట్లు పడుతున్నాయి. ముస్లింలపై తమకే పేటేంట్​ ఉందనుకునే అసదుద్దీన్​ ఓవైసీ పార్టీ కూడా సభలు..సమావేశాలు నిర్వహిస్తోంది. రోజు అక్కడక్కడ నిర్వహిస్తున్నట్టుగానే.. నిన్న (20 ఫిబ్రవరి 2020) బెంగళూరు, న్యూఢిల్లీలో రెండు  చోట్ల సభలు నిర్వహించారు. ఈ రెండు చోట్ల అసదుద్దీన్​ ఎదురుగానే.. ఓ ఇద్దరు సీరియస్​ కామెంట్లు చేశారు. 

వారిస్​ పఠాన్​ అనే ఒకాయనైతే.. అప్పట్ల అక్బరుద్దీన్​ ఓవైసీ చేసిన కామెంట్లకు దగ్గరగా కామెంట్లు చే శారు. 100 కోట్ల మందికి 15 కోట్ల మంది ముస్లింలు చాలు జవాబియ్యడానికంటూ అసదుద్దీన్​ పట్ల భక్తి చాటుకున్నాడు. ‘ఇప్పుడు ఆడ సింహాలే రోడ్డెక్కితినే.. మీకు చెమట్లు పడుతున్నాయ్​. 15 కోట్ల మంది ముస్లింలు ఒక్కటైతే.. మీ 100 కోట్ల మంది స్వాతంత్ర్యం దోచుకుంటాం’ హెచ్చరికలు జారీ చేశారు. ఇంతకు మించి వీళ్ల దేశభక్తిలోని నగ్నత్వం వివరించి చెప్పాల్సిన అవసరం లేనట్టే. బెంగళూరులో వారిన్​ పఠాన్​ చెపినట్టుగానే.. ఒక ఆడ సింహం ఏకంగా ఇమ్రాన్​ఖాన్​ ప్రధానమంత్రిగా ఉన్న దేశాన్ని కీర్తిస్తూ జిందాబాద్​.. జిందాబాద్​.. జిందాబాద్​ అంటూ కామెంట్లు చేశారు.

ఇక్కడ మాత్రం అసద్​కు చెమట్లు పట్టేశాయి. తన మనసులో ఉన్నది బయటపెట్టేసిందే అనుకున్నాడో ఏమో ఆమె చేతుల్లోంచి మైకు గుంజుకోవడానికి ప్రయత్నించినా.. ఎంతైనా పఠాన్​ చెప్పినట్టుగా ఆడ సింహం కదా.. అసలివ్వలేదు. చెప్పాల్సిన మూడు ముక్కలు చెప్పేశాకే మైకు ఇచ్చేసింది. ఇక దాన్ని కవర్​ చేసుకోవడానికి నానా తిప్పలు పడ్డాడనుకో. ఆమె ఎవరో తెలీదు.. అలాంటి వాళ్లను పిలవాల్సింది కాదు. మా పార్టీకి సంబంధం లేదంటూ ఎన్నో మాటలు. ఇక్కడోటి గుర్తుంచుకోవాలి. అమూల్యా లియోన అనే ఈమె సీఏఏ, ఎన్నార్సీని తీవ్రస్తాయిలో వ్యతిరేకిస్తున్నారు. వివాదస్పద కామెంట్ల కూడా చేశారు. ఆమె ఫేస్​బుక్​ చూస్తే ఇదంతా తేలిపోతుంది. అందుకే ఆమెను పిలిచారు. వీళ్లు అనుకున్నట్టే ఆమె నినదించారు. ఈ ఆడ సింహం చేసిన జిందాబాద్​కు మనసులో ఇష్టంగా ఉన్నా.. పైకి మాత్రం కంగారు పడుతున్నట్టు చేస్తున్నారని కొందరంటున్నారనుకో.. అది వేరే విషయం. ఏదీ ఏమైనా అసద్​ పా ర్టీ దేశభక్తి నగ్నత్వం మాత్రం పూర్తిగా బయటపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here