Home breaking news అదే ఇక్కడ నిషేధిస్తే దుర్మార్గులు మతోన్మాదులే కాదు నోటికెంత వస్తే అంత

అదే ఇక్కడ నిషేధిస్తే దుర్మార్గులు మతోన్మాదులే కాదు నోటికెంత వస్తే అంత

534
1
ఫొటో: ఇంటర్​నెట్​ నుంచి

–ఆదిత్య

కొందరు చేస్తే ఏదీ తప్పు కాదు. కొందరు ఏది చేసినా తప్పే అంటారు. మనం ఇప్పుడు ప్రస్తావించుకునే అంశం కూడా ఇందులో భాగమే. విషయానికొస్తే ఒకానొక దేశంలోని ఒక నగరంలో ‘వాలంటైన్స్​ డే’ వేడుకలను నిషేధించారు. వాలంటైన్స్​ డే ముగిసిపోయిందిగా..  అయిపోయిన పెళ్లికి ఇప్పుడు చప్పుడెందుకు అన్నట్టుగా ఇప్పుడీ ముచ్చటెందుకుని అనొచ్చు. ఇక్కడే ఉంది అసలు విషయం. ఇంతకీ ‘వాలంటైన్స్​ డే’ను నిషేధించించి ఎక్కడంటే. ముస్లింలు ఎక్కువగా ఉన్న  ఇండోనేషియాలోని బాండా అచ్చే నగరంలో. ఇది సంగతి. నిషేధానికి కారణమేమిటంటే.. ముస్లింలు ఎక్కువగా ఉన్న ఈ నగరంలో వాలంటైన్స్​ డే వేడుకలను నిర్వహించడం మత విశ్వాసాలకు విరుద్ధమంటూ నగర మేయర్‌ అమీనుల్లా ఉస్మాన్‌ ఉత్తర్వులు జారీ చే శారు. హోటళ్లలో, రెస్టారెంట్స్‌లో, మరే ఇతర వేదికలపై వాలంటైన్స్‌ డేను పురస్కరించుకొని ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడానికి వీల్లేదని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా ఇలాంటి వేడుకలకు యువతీ యువకులు దూరంగా ఉండాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.

ఇండోనేసియాలోని సుమత్ర దీవుల్లో ఉన్న ఈ బాండా ఆచ్చే నగరం ఆచ్చే రాష్ట్ర రాజధాని. షరియా చట్టాన్ని అమలు చేస్తున్న ఏకైక ముస్లిం మెజారిటీ రాష్ట్రం ఇండోనేసియాలో ఇదొక్కటే. ఆ రాష్ట్రంలో వివాహేతర సంబంధాలను, పెళ్లికి ముందు లైంగిక సంబంధాలను, జూదాన్ని, గే సంస్కృతిని నిషేధించారు. ఇక ఇప్పుడు విషయానికొద్దాం. మొన్న వాలంటైన్స్​ డే నాడు భజరంగ్​దళ్​ అనే ఒక సంస్థ మేము ఒప్పుకోమని ప్రకటన విడుదల చేయడంతో పాటు ఒక హోటల్లో కొన్నింటిని విరగొట్టారు. వాళ్లపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేమికుల రోజును ఒప్పుకోకపోవడమేమిటని మండిపడ్డారు కొందరు. చత్​ వీళ్ల ఫర్మిషన్​ ఎవడికి కావాలంటూ ఇంకొందరు. పొరపాటున ఒక వేళ పొరపాటున బీజేపీ సర్కారు అధికారంలో ఉన్న ఏదైనా ఒక రాష్ట్రంలో ‘వాలంటైన్​ డే’ నిషేధిస్తున్నామని ఒక ప్రకటన వెలువడితే.. ఉండేదీ దేశంలో కాక. మతం.. మతోన్మాధులు.. ఉన్మాధులు.. ఛాందసవాదులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో తిట్లు తిట్టేవారు. ఈ దేశంలోని రాష్ట్రాల్లోనే కాదు  పక్కదేశాల్లో కూడా నిరసన ప్రదర్శనలు జరిగేవీ. జరిపించేవారు. మొన్నటి సీఏఏ, ఎన్నార్సీ మాదిరిగా. కానీ ఇప్పుడు వాలంటైన్​ డే నిషేధించింది ఒక ముస్లిం రాజ్యం. అందుకే ఎవడూ మాట్లాడడు. ఎందుకని ప్రశ్నించడు. ఎందుకంటే.. లౌకికవాదం హిందువులే పాటించాలి. ఇతర మతాలు కాదనేది ఇక్కడి మేథావుల వాదన. కాదంటారా.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here