–వికాస్ రుషి
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (బాబుకు ఇష్టం లేకున్నా తప్పదుగా) మహా సమర్థులు. ఇంతకంటే పెద్ద పదమున్నా వాడొచ్చు. ఇప్పుడు అమరావతి కోసం జోలే పట్టేశారు. అందుకోసం అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. అందరంటే.. అదే కమ్యూనిస్టులు. కమ్యూనిస్టులు అంటే అందరూ కాదు సుమా. ఒక్క సీపీఐ మాత్రమే. సీపీఎంను ఎందుకు విడిచి పెట్టేశారో..? లేకుంటే వాళ్లు రానన్నారో తెలీదు కానీ. ఈ జోలే సీన్లో వాళ్లు లేరు. ఇంతకీ జోలే ఎందుకు పట్టారంటే.. అమరావతి పరిరక్షణకోసమని ఏర్పాటు చేసిన ‘రక్షణ’ సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. దీనిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాన నేత. ఆయనే జోలె పట్టారు. పాపం గేగులు అమ్మకునే వాళ్లు కూడా తమ సంపాదనలో కొంత ఆ జోలెలో వేశారు.ఇంతకీ ఈ జోలే పట్టింది అమరావతి కోసం కాదహె అంటారు కొందరు. ఎందుకయ్య అంటే అధికారం కోసమంటారు. అధికారం ఇప్పటికిప్పుడు ఎలా.. ఇంకా నాలుగేళ్లు పడుతుందిగా.. అంటే మరి అప్పటిదాకా లైవ్‌లో లేకుంటేఎలా..? ‘రాజాధిరాజ.. రాజ మార్తాండ. జయ్ భవ. విజయ్ భవ’ అనాలి కదా అనేస్తారు.
సరే ఈ సమర్థులు అన్న అంశానికొద్దాం. మామగారిని అదే సీనియర్ ఎన్టీఆర్ మొదటి వెన్నుపోటు సీనులో నాదెండ్ల భాస్కరరావు వెంట కాకుండా ఎన్జీఆర్ వెనుకే నిలబడిన వాళ్లను.. రెండో వెన్నుపోటు సీను అదే చంద్రబాబు ఎపిసోడ్ నాటికి ఎన్టీఆర్ వెంట కాకుండా.. లక్ష్మీపార్వతిని చూపించి.. తన వెనుకకు తిప్పుకున్నారు. ఆ మరుసటి ఎన్నికల సమయానికి బీజేపీ బలపడుతున్న విషయాన్ని గమనించి.. పట్టుబట్టి.. ఆ పార్టీలో తన కులానికి చెందిన నేతను మెప్పించి.. బీజేపీని బలిపశువుగా చేసి అధికారం చేపట్టేశారు. అధికారికంగా రెండో టర్మ్, అనధికారికంగా మూడో టర్మ్‌ను దేశం వెలిగిపోతోందని బీజేపీకి నచ్చజెప్పి.. తన చేతికికట్టుకట్టుకొనిమరీ ఎన్నికలకు పోయి బొక్కా బోర్లా పడ్డారు. ఆ తరువాత గుజరాత్ ఇష్యూతోనే బీజేపీ మతోన్మాద పార్టీగా మారిపోయిందని.. జీవితంలో ఆ పార్టీతో జతకట్టనని బహిరంగంగా ప్రామీస్ చేశారు. ఆ తరువాత రెండు ఎన్నికల్లో ఒకసారి కమ్యూనిస్టులను వాడుకున్నాడు.రెండోసారి టీఆర్ఎస్ను వాడుకుందామనుకున్నాడు. కానీ టీఆర్ఎసే టీడీపీని ఆడుకొని అధికారం దక్కకుండా చేసేసింది. ఇది చరిత్ర.
కొత్త చరిత్రకు వస్తే 2014 ఎన్నికలు మళ్లీ బీజేపీ కన్పించింది. వెంటనే ఆ పార్టీతో మళ్లీ పొత్తు అధికారంలోకి వచ్చేశారు. 2018 మొదట్లోనే బీజేపీకి బలం తగ్గుతున్నట్టు చంద్రబాబుకు కన్పించింది. వెంటనే దూరం జరిగి.. మళ్లీ ఈసారి ఎన్నడూ చేయని ప్రయోగం చేశారు. అది ఏపీలో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడం. దేశంలో అదేదో ఫ్రంట్ అని వెళ్లడం ఇలా తాను బొక్కా బోర్ల పడడంతో పాటు పాపం రాహుల్‌ను పడేశారు. ఇక్కడ కూడా అప్పటి సమైక్య ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. చిరంజీవి అనే ఒక జీవితో పార్టీని ఏర్పాటు చేసేలా చేశాడని తద్వారా టీడీపీకి గండికొట్టాడన్న ప్రచారం.. 2014లో పవన్ కల్యాన్ అనే నటుడితో పార్టీ ఏర్పాటు చేయిందని బీజేపీపై ఉన్న ప్రచారం.. లేదా ఆ రెండు పార్టీలు చేసిన ప్రయోగమూ కావచ్చు.. అప్పట్లో సక్సెస్ అయ్యారు. అందుకే తాను అదే విధంగా అనుకొని పవన్ కల్యాన్‌తో అన్ని సీట్లకు పోటీ చేయించాడన్న ప్రచారం ఉంది. ఇందులో నిజమెంతో చంద్రబాబుకు తెలియాలి. అయినా ప్రయోగం ఫెయిలైంది. అందుకే ఈ అమరావతి పరిరక్షణ సమితి పేరుతో ఒకటి ఏర్పాటు చేసి.. అందులో అందరికీ కలుపుకొని పోతున్నరన్న ప్రచారమైతే ఉంది. అది సరే. మొత్తానికి తాను ఒక్కడిని సొంతంగా ఏదీ చేయలేనని.. గెలిచినా.. ఓడినా గౌరవంగా ఉండాలంటే కలపుకొని పోవడమే శరణ్యమని అనుకున్నట్టున్నారు అందుకే
అమరావతి పరిరక్షణ సమితి కాదు కాదు టీడీపీ పరిరక్షణ సమితి ఏర్పాటు చేశారని ప్రచారమైతే ఉంది. ఇందులో నిజమెంతో అబద్ధమెంతో బాబుకుఅయనకు మద్దతుగా నిలిచిన మీడియా పెద్దలకే తెలియాలి.