–ఆదిత్య
సినీ నటి రవీనా టాండన్పై కేసు నమోదైంది. తెలుగు పత్రికల్లో ఈ వార్తకు అంత ప్రాధాన్యమివ్వలేదు కానీ జాతీయ మీడియాలో ని కొన్ని చానళ్లు వంట వండేశాయి. ఇంతకీ ఆమెపై కేసు ఎందుకు నమోదైందో తెలుసా..? ఈ నెల 25న అంటే క్రిస్మస్ రోజున నటి రవీనా టాండన్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, కమేడియన్ భారతీ సింగ్తో కపిల్ శర్మ ఒక వెబ్ షో నిర్వహించారు. ఈ షోలో క్రైస్తవులు పవిత్రంగా ఉచ్చరించే ‘హలేలూయా’ పదాన్ని వక్రంగా మాట్లాడారని ఆలిండియా క్రిష్టియన్ ఫ్రంట్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పంజాబ్ పోలీసులు 295 (ఏ) కింద కేసు నమోదు చేశారని ఈ వార్తలో సారాంశం. మతాన్ని, సంప్రదాయాలను ఎవరైనా సరే.. ఎవరైనా సరే కించ పరిచేలా వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఫిర్యాదు చేయడం, కేసు బుక్ చేయడం మంచిదే. శిక్షించాలి కూడా.
ఇంతకీ ఇందులో హిందువుల ప్రసక్తి ఎందుకు తీసుకొచ్చానంటే.. హిందూ మతంపై ఎన్నో అపహాస్యాలు.. కోట్ల మంది పూజించే దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు. ఓంకారాన్ని అపస్వరంగా పలికే ఎన్నో కంఠాలు. ఇవన్నీ సినిమాలతో పాటు.. ఇతరులు బహిరంగంగానే.. అలవోకగా పలికేస్తుంటారు. మరి ఇటువంటివి హిందూమతంలో కొనసాగుతున్న వాళ్లుఎందుకు పట్టించుకోరు. ఎందుకంటే వీళ్లకు తోలుమందం. ఒకవేశ ఎవడైనా మా మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యానిస్తారా..? అని రోడ్డేక్కితే. నువ్వు ఆర్ఎస్ఎస్ మనిషివా..? బీజేపీ మనిషివా..? అందుకే ఫిర్యాదు చేస్తున్నావా..? అన్న కామెంట్లు. దీంతో వాడు వెనక్కి తగ్గుతాడు. అంటే ఇక్కడ హిందువులకు మద్దతుగా నిలబడే వారంతా ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్లేనా.? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఇంకో విషయమేమిటంటే.. ఎవరి మతాన్ని ఎవరూ కించపరచవద్దు నిజమే. హిందూయేతర మతంపై ఎవడైనా ఎవడైనా ఒక మాట జారితే.. వాడిపై లేదా వాడి సంస్థపై ఎన్నో సంస్థలు.. ఉవ్వెత్తున్న లేస్తాయి. మరి హిందూ మతంపై ఎవడైనా మాట జారితే ఎవడూ పట్టించుకోరేం. ఈ దేశంలో హిందూయేతర మతాల కోసమే సెక్యులరిస్టులు పని చేస్తున్నారా..? మరి హిందువుల కోసం ఎవరు పని చేయాలి. ఎవడో ఒకడు పని చేయాలిగా. వాడు ఏ పార్టీ వాడైతే నాకెందుకు.. ఏ సంస్థ వాడైతే నా కెందుకు..? నా మతం కోసం.. నేను పూజించే దైవం కోసం పని చేసే వాడూ ఉండాలి కదా.? నిజమా..? కాదా..?