Home తాజా వార్తలు పోటీపడి ఎంత డప్పు కొట్టినా.. ఆ పేపర్లపై దయచూపట్లే

పోటీపడి ఎంత డప్పు కొట్టినా.. ఆ పేపర్లపై దయచూపట్లే

666
0
మన తెలంగాణ న్యూస్​ క్లిప్పింగ్​

ఎంత బాగా డప్పుకొడితే..  అదే స్థాయిలో డప్పుకొట్టిన వ్యక్తిపై దయ చూపుతరన్న లెక్కుంది. ఎంత పొగిడితే.. అదే లెక్కన దయుంటది. ఇది అందరికీ ఎరుకున్న లెక్కే. ఆ లెక్కమాత్రం ఇక్కడ తప్పింది సుమా. తెలంగాణ వచ్చిన కొత్తలో పేపర్లు కేసీఆర్​ను పీకి పాకాన పెట్టాయి. రచ్చకూడా చేశాయి. టీవీ 9 పుణ్యమా అని.. చానళ్లు ఎంత ప్రసారం చేసినా.. ఎక్కడికక్కడ జనాల వద్దకు పోకుండా కేసీఆర్​ చేసిండు. ఆ దెబ్బకు ఛానళ్లు సాగిల పడ్డాయి. వరంగల్​లో కేసీఆర్​ చెప్పిన ఒకే ఒక్క మాట. పాతాళానికి తొక్కేస్తామన్న కేసీఆర్​ డైలాగ్​కు ప్రధాన పత్రిక ఈనాడు బొక్కబోర్లా పడిపోయింది. (ఇందులో ఫిల్మ్​ సిటీ యవ్వారం కూడా ఉందంటరు) సాక్షి కూడా కేసీఆర్​ పక్షమై పోయింది.

ఆంధ్రజ్యోతి మాత్రం అప్పుడప్పుడు బుస కొడ్తోంది. నమస్తే తెలంగాణ పత్రిక సంగతి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇదే జాబితాలోనే మన తెలంగాణ, వార్త, ఆంధ్రప్రభ కూడా ఉన్నాయి. సీపీఎం, సీపీఐ పార్టీల పత్రికలైన నవ తెలంగాణ, ప్రజాపక్షం యధాతథంగా తమ సిద్ధాంతానికి కట్టుబడ్డట్టుగా రాసుకుంటూ పోతున్నాయి. కొత్తగా ‘వెలుగు’తున్న పత్రిక ఇప్పుడు బీజేపీ సిగలో ఉంది. కాటేస్తా కాటేస్తా అన్నట్టుగా పడగ విప్పుతోంది. ఏమాటకు ఆ మాటే వెలుగు పత్రిక ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఆంధ్రజ్యోతి మాత్రం రెండు విధాలుగా ముందుకు సాగుతోంది.

ఈ పేపర్లు ఎంత చేసినా.. కేసీఆర్​ మాత్రం వాటి వంక చూడడం కూడా చూడడం లేదు. పేపర్లకు ప్రాణావాయువు యాడ్స్​. సర్కారు తరుపున పేపర్లకు ఇచ్చే యాడ్స్​ దాదాపుగా నిలిపివేసిండు. పోరాటం చేయాల్సిన పేపర్లు మొత్తానికి మొత్తంగా కేసీఆర్​ను జీ హుజూర్​ అంటున్నాయి. నిన్నటి బడ్జెట్​ వార్తలు చూడండి. ఎక్కడైనా సర్కారుకు వ్యతిరేకంగా వెలుగు, ఆంధ్రజ్యోతి తప్ప ఎవరన్నా రాసిండ్రో. ‘మాంద్యం ముసురుతున్నా..సంక్షేమ బాటే’ అంటూ ఈనాడు మొత్తం సాగిలబడి రాస్తే. టీఆర్​ఎస్​కు అనుబంధంగా పని చేస్తున్న మిగిలిన పత్రికలు కూడా అదే విధంగా రాసేశాయి. ఈ విధంగా సాగిలబడి రాస్తున్నా.. కేసీఆర్​ మాత్రం వాటి వంక కన్నెత్తి చూడడం లేదు. పన్నెత్తి మాట్లాడడం లేదు. ఒక్క యాడ్​ కూడా ఇవ్వడం లేదు.

2018లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్కారు నుంచి యాడ్​ అన్న మాట రావడం లేదు. దాదాపుగా 10 నెలలుగా సర్కారు నుంచి యాడ్స్​​ లేకుండా పేపర్లు బక్కచిక్కి పోయాయి. దీనంగా చూసినా ఎవరికి జాలి కలగాలో వారికి కలగడం లేదు. బతిమాలి సాగిలపడినా.. ఎంత డప్పుకొట్టినా.. ముఖ్యమంత్రి కేసీఆర్​ మాత్రం దయమాత్రం చూపడం లేదు. పాపం పేపర్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here