ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీఎల్) సదరన్ రీజియన్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 413 ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనుంది. ట్రేడ్ అప్రెంటీస్ 353 పోస్టులు ఖాళీగా ఉండగా.. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు 60 ఖాళీగా ఉన్నాయి. అర్హులైన వారు ఈ నెల 7 లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష ఈ నెల 18న ఉంటుంది. రాత పరీక్ష ద్వారానే ఎంపిక చేస్తారు.
ట్రేడ్ అప్రెంటీస్
అర్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. జూలై 31 నాటికి 18 నుంచి 24 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది.
టిక్నీషియన్ అప్రెంటీస్
సంబంధింత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లోమా ఉత్తీర్ణత ఉండాలి. జూలై 31 నాటికి 18 నుంచి 24 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది.