బెంగళూరుః హిందుత్వంలో లింగాయత్ అంతర్భాగం కాదని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అంతర్భాగం కాదన్న మాత్రాన హిందుత్వం వెలుపల కూడా లింగాయత్ లేదన్నారు. లింగాయత్ ప్రత్యేక మతమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. ప్రొఫెసర్ సిద్ధరామయ్య రచించిన లింగాయత్ కన్నడ వచన ధర్మ, వచన పుస్తకాలను ఆయన విడుదల చేసి మాట్లాడారు. తాను చెప్పేదీ అందరి అభిప్రాయం కాదనినా అభి ప్రాయం ప్రకారం లింగాయతులు హిందూత్వం లో అంతర్భాగం కాదని అంతకుమించి వెలుపల కూడా కాదన్నారు. కుల వ్యవస్థ బానిసత్వం వంటిదని తెలిపారు. విద్యావంతులు సైతం కులవ్యవస్థ కు అతీతం కాదన్నారు. సమాజంలో అగ్రకులాలుగా పిలుస్తున్న వారు కనిపిస్తే స్వామి, అని గౌరవంగా పిలుస్తారని చెప్పిన ఆయన.. బలహీనవర్గాలకు చెందిన వారుని మాత్రం ఏరా అని సంబోదిస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.