కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పేరుతో ఒక పేద్ద కత మొదలైంది. యువరాజు లేకుంటే మేము లేనేలేము అన్నట్టుగా..ఉందీ కత. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినందున నైతిక బాధ్యతగా రాహుల్ తన అధ్యక్ష పదవికి దాదాపు నెలకింద రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయనను సోనియా, ప్రియాంక సహా అందరూ బుజ్జగించే ప్రయత్నాలు చేసినా.. రాహుల్ మాత్రం ఒకేమాట.. ఒకే రాజీనామా అన్నట్టుగా భీష్మించుకొని కూర్చున్నారు.
మీటింగ్‌ల మీద మీటింగ్లు పెట్టి.. విశ్వసనీయంగా పార్టీ ఓటమికి కారణమయ్యారంటూ.. సోదరి ప్రియాంక భగ్గుమన్న సంగతి తెలిసిందే. పార్టీ ఓటమికి అందరి బాధ్యత ఉందని ఆమె చెప్పుకొచ్చారు. అయినా.. ఏ ఒక్కరూ ఓటమికి బాధ్యతలగా తమ పదవులకు రాజీనామా చేసిన ఉదంతం కన్పించలేదు. పార్టీ ఓటమికంటే రాహుల్ తన వెనుక ఎవరూ రాకపోవడమే మరీ బాధ కల్గించినట్టుంది. తనను రాజీనామా ఉపసంహరించుకోవాలని అంటున్నారే.. తప్ప.. ఓటమిలో తమకూ బాధ్యత ఉందని చెప్పడం లేదే అని మదనపడ్డట్టుగా ఉంది. ఇక ఊరుకోలేక.. *ఓటమికి నేనెక్కడినే బాధ్యత వహించాలా..? మీకు బాధ్యత లేదా.? ఎవరూ రాజీనామాలు చేయకుంటే..నేనేం చేయాలి. రాజీనామా చేయమని నేనే అడగాలా..? * అని రాహుల్ అన్నాట్ట.
రాహుల్ చేసిన వ్యాఖ్యల వెనుక అంతరార్థం, మనసులో ఉన్న ఆవేదనను గుర్తించిన కాంగ్రెస్ న్యాయ విభాగం అధ్యక్షుడు, ఎంపీ వివేక్ తనఖా ముందస్తుగా రాజీనామా చేశారు. తద్వారా రాహుల్ మనసులోని బాధను అందరూ గుర్తించే విధంగా చేశారు. ఆ తరువాత మొదలైంది చూడూ తెలంగాణ సాధన కోసం మేమూ రాజీనామా చేశాము అంటూ అప్పట్లో అనేకమంది ఉత్తిత్తి రాజీనామాలు చేశారు చూడూ అట్ల మొదలైంది రాజీనామాల కత. తెలంగాణ నుంచి పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డి.. చివరాఖరుకు వీ హనుమంతరావు కూడా రాజీనామా చేశారు. రాజీనామా జాబితా చాంతాడం ఉంది. ఎట్టయితేందీలే మొత్తానికి తన కోసం పార్టీ నేతలు రాజీనామాలు చేశారు అని చెప్పుకోవడానికి రాహుల్‌కు అవకాశమూ దొరికింది.