Home ఎడ్యుకేషనల్/జాబ్స్ ప్లాస్టిక్ పరిశ్రమలో విస్తృత అవకాశాలు – సీఐపీఈటీ డైరెక్టర్ ఏవీఆర్ కృష్ణ‌

ప్లాస్టిక్ పరిశ్రమలో విస్తృత అవకాశాలు – సీఐపీఈటీ డైరెక్టర్ ఏవీఆర్ కృష్ణ‌

572
0

హైద‌రాబాద్ః మన దైన౦దిన జీవిత౦లో ప్లాస్టిక్ వాడ‌కం పెరిగిపోయింద‌ని పత్రికా సమాచార కార్యాలయ౦ అడిషనల్ డైరెక్టర్ జనరల్ టీవీకే రెడ్డి అన్నారు. ప్లాస్టిక్ కి డిమా౦డ్ ఏర్పడడ౦ వలన ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయ‌ని తెలిపారు. సెంట‌ర్ ఫర్ స్కిల్లింగ్ అండ్ టెక్నిక‌ల్ స‌పోర్ట్ డైరెక్టర్ ఏవీఆర్ కృష్ణ మాట్లాడుతూ ప్లాస్టిక్ ర౦గ౦ ద్వారా విస్తృత అవకాశాలు లభిస్తాయన్నారు. ప్లాస్టిక్ ని సరైన విధ౦గా వాడేలా ప్రజలలో తమ స౦స్థ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. భార‌త ప్ర‌భుత్వ సంస్థ‌ లలో ఒకటైన సెంట‌ర్ ఫర్ స్కిల్లింగ్ అండ్ టెక్నిక‌ల్ స‌పోర్ట్ (సీఎస్‌టిఎస్‌) ర‌సాయ‌నాలు మ‌రియు ఎరువుల మంత్రిత్వ శాఖ లోని ర‌సాయ‌నాలు మ‌రియు పెట్రో ర‌సాయ‌నాల విభాగం ఆధ్వ‌ర్యం లో ప‌ని చేస్తోంద‌ని తెలిపారు. 1987లో ఈ సంస్థ ను హైద‌రాబాద్ లో స్థాపించామ‌ని చెప్పారు. ప్లాస్టిక్స్ మ‌రియు సంబంధిత ప‌రిశ్ర‌మ‌ల కు శిక్ష‌ణ ను, సాంకేతిక సేవ‌ల‌ను ఈ సంస్థ అందిస్తోంద‌పి తెలిపారు. అత్య‌ధునాత‌న‌మైన డిజైన్‌, సిఎడి/సిఎఎం/సిఎఇ/ టూలింగ్, ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్, టెస్టింగ్ డిపార్ట్‌ మెంట్స్ సంబంధిత స‌దుపాయాల‌ ను ఈ కేంద్రం లో సమకూర్చామ‌న్నారు. ఈ సంస్థ కేంప‌స్ లో పూర్తి స్థాయి సౌక‌ర్యాల‌ తో పాటు బాల బాలిక‌ల‌ కు వ‌స‌తి గృహాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. ఎఐసిటిఇ ఆమోదం క‌లిగిన దిగువన పేర్కొన్న దీర్ఘ‌ కాల శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ ను ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని సిఐపిఇటి : సిఎస్‌టిఎస్ లో నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌స్తుత విద్యా సంవ‌త్స‌రం లో ఈ సంస్థ లో 532 మందికి శిక్ష‌ణ ఇస్తున్నామ‌ని తెలిపారు. ఈ ఏడాది కూడా వివిధ విభాగాల్లో శిక్ష‌ణ ఇవ్వ‌నున్నామ‌ని వెల్లడించారు.
ఈ కింద పేర్కొన్న విభాగాల్లో శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్టు చెప్పారు.

  1. పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ & టెస్టింగ్ (పిజిడి-పిపిటి)
  2. పోస్టు డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్ – సిఎడి/సిఎఎం (పిడి -పిఎండి) తో పోస్ట్ డిప్లొమా
  3. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాల‌జీ (డిపిఎంటి)
  4. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాల‌జీ (డిపిటి)
    ఈ కోర్సుల లో ప్ర‌వేశానికి ఎలాంటి వ‌య‌స్సు ప‌రిమితి లేదని తెలిపారు. ఆస‌క్తి క‌లిగిన వారు జూన్ 30 వ‌ర‌కూ ఆన్‌లైన్‌లో eadmission.cipet.gov.in ద‌ర‌ఖాస్తు చే సుకోవాల‌ని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here