హైదరాబాద్ః కిజికిస్తాన్‌లో 23 నుంచి రెండో మాస్ మీడియా ఫోరమ్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు భారత ప్రతినిధిగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ టీవీకే రెడ్డి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ మేరకు భారత ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) దేశాల రెండో మాస్ మీడియా ఫోరమ్ ఈ నెల 23 నుంచి 26 వరకూ కిజికిస్థాన్‌లో జరగనుంది. కిజికిస్థాన్ రిపబ్లిక్, సంస్కృతి, సమాచార మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ బిష్కెక్ లో నిర్వహించనుంది. ఈ సందర్భం గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అభివృద్ధి లో మాస్ మీడియా పాత్ర అంశం పై చర్చ జరపనుంది. ప్రపంచ సమాచార రంగంలో ఎస్‌సీవో విజన్ ఇమేజ్ ను పటిష్టపరచేందుకు కార్యాచరణ ను రూపొందించనున్నారు. ఎస్‌సీవో తొలి మీడియా సమ్మిట్ గతేడాది జూన్‌లో బీజింగ్ లో జరిగింది. నాటి కార్యక్రమానికి ఎస్‌సీవో సభ్య దేశాలు, పరిశీలక దేశాలు, చర్చ సంబంధిత భాగస్వాములతో పాటు, 16 దేశాలకు చెందిన 110 కి పైగా మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్న సంగతి తెలిసిందే.