హైదరాబాద్ః తెలంగాణ లో ఒక ఏక వ్యక్తి, నియంత పరిపాలనా సాగుతోందని కాంగ్రెస్ నేత మల్లు రవి తెలిపారు. కలెక్టర్ ల అధికారాలు మంత్రులకు ఇవ్వడం సరికాదన్నారు. దీని వల్ల ప్రజలకు నష్టం వాటిల్లితుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థ ల ఎన్నికల పోటి చేసే అభ్యర్థుల ఎంపిక కూడా సీఎం కేసీఆర్ చేతుల్లోకి తీసుకోవడం ఏమిటన్నారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకని ప్రశ్నించారు. స్థానిక సంస్థలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. తద్వారా ప్రజాస్వామ్యం ను బతికించుకోవాలన్నారు. అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రెవిన్యూ శాఖలో ఎన్ ఐ సి స్తానం లో కేటీఆర్ సన్నిహిత వ్యక్తి కి ధరణి వెబ్సైట్ ను అప్పజెప్పారని ఆరోపించారు. ఆది సరిగా పని చేయకపోవడంతో..దాని పేరుతో రెవెన్యూ శాఖ పై కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. విద్యాశాఖ లో ఒక్క పోస్టు ని నింపలేదన్నారు.