ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పెద్ద నాయకులు రావాలి. ప్రచారం చేయాలి. తాము గెలవాలి. అని కోరుకుంటారు. అయితే ఈ ఎన్నికల్లో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. పెద్ద నాయకులా..? ప‌్రచారమా..? వద్దు బాబోయ్ అంటున్నారంట. ఇదెక్కడో జరుగుతున్నది కాదు. తెలంగాణలోనే జరుగుతోంది. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బీజేపీ అభ్యర్థులకు ప్రచారం చేయడానికి కేంద్రమంత్రులు రావాల్సి ఉంది. కానీ వారు రాలేదు. ఎందుకా అని ఆరాతీస్తే.. బహిరంగసభలు మేము నిర్వహించలేము. ఆ ఖర్చూ మా వల్ల కాదు. అని చెబుతున్నరంట. పార్టీ ఖర్చు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదంటున్నారు. టికెట్ ఇస్తే పోటీ చేస్తాము. గెలుస్తాము అని చెప్పుకునే నాయకులు ఇలా ప్రచారం వద్దనడం విచిత్రంగా ఉంది కదా.