దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్ సభతో పాటు పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర ఎన్నికల షెడ్యూలు ప్రకటించారు. షెడ్యూలు ప్రకటించగానే దేశవాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. లోక్ సభ 543 స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 175, ఒడిశా 147, సిక్కిం 32, అరుణాచల్ ప్రదేశ్ 60 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మార్చి18న మొదటి నోటిఫికేషన్ విడుదల
ఏప్రిల్ 11న తొలి విడత లోక్ సభ ఎన్నికలు
ఏప్రిల్ 18న రెండోదశ లోక్ సభ ఎన్నికలు
ఏప్రిల్ 23న మూడో దశ లోక్ సభ ఎన్నికలు
ఏప్రిల్ 29న నాలుగో దశ లోక్ సభ ఎన్నికలు
మే 6న ఐదో దశ లోక్ సభ ఎన్నికలు
మే 12న ఆరోదశ లోక్ సభ ఎన్నికలు
మే 19న ఏడో దశ లోక్ సభ ఎన్నికలు
మే 23న ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు
ఏడు దశల్లో ఎన్నికలు
మొదటి దశలో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, సిక్కిం, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ్‌బెంగాల్, లక్షద్వీప్
రెండో దశలో: జమ్ముకశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, త్రిపుర, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్, పుదుచ్చేరి
మూడో దశలో: అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ్‌బెంగాల్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ
నాలుగో దశలో: బిహార్, జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ్‌బెంగాల్
ఐదో దశలో: బిహార్, జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ్‌బెంగాల్
ఆరో దశలో: బిహార్, హరియాణా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ్‌బెంగాల్, దిల్లీ
ఏడో దశలో: బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, పంజాబ్, పశ్చిమ్‌బెంగాల్, చండీగఢ్, ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్