Home breaking news ఎల్లో మీడియా అనడానికి ఆ రెండు పేపర్లకు 100 శాతం అర్హత

ఎల్లో మీడియా అనడానికి ఆ రెండు పేపర్లకు 100 శాతం అర్హత

116
0

ఎల్లో మీడియా అనడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి నూటికి నూరు శాతం అర్హత సాధించాయి. ఈ రోజు ఆ రెండు పేపర్ల ఏపీ ఎడిషన్లను చూస్తే వైఎస్సార్​ కాంగ్రెస్​ విమర్శిస్తున్నట్టుగా ఎల్లో మీడియా అని నిర్దారణ చేసుకోవచ్చు. కందుకూరులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నిర్వహించిన రోడ్​ షోలో తొక్కిసలాట జరిగింది. ఎనిమిది మంది చనిపోయారు. అంతమంది చనిపోతే ప్రాధాన్యం ఇవ్వకుండా ఇచ్చామా..? అంటే ఇచ్చామూ అన్నట్టుగా కవరేజీ ఇచ్చారు. ఈనాడులో ‘తీవ్ర విషాదం’ హెడ్డింగ్​తో,ఆంధ్రజ్యోతిలో ‘పెను విషాదం’ హెడ్డింగ్​తో వార్తను అచ్చేశారు.  ఈ వార్తకు సరి సమానంగా ప్రధాని మోదీని సీఎం జగన్​ అప్పు అడిగిన వార్తను ఇచ్చారు. ఆంధ్రజ్యోతి అయితే మరీనూ ‘శ్రీమంత సీఎం’ హెడ్డింగ్​తో జగన్​ వార్తను ఇచ్చారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి 400 రోజులు 4 వేల కిలో మీటర్ల లోకేశ్​ పాదయాత్ర పోస్టర్​ ఆవిష్కరణ వార్తను ఇచ్చారు. తీవ్ర విషాదం వార్తకంటే పోస్టర్​ ఆవిష్కరణ వార్తకే ఈనాడు ప్రాధాన్యం ఇచ్చింది. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వాస్తవానికి పోస్టర్​ ఆవిష్కరణ, అప్పు కోరిన వార్తలకు ఇంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. లోపలి పేజీల్లో వేసుకోవచ్చు. కానీ చంద్రబాబు అంటే ఈ రెండు పేపర్లకు మహా ఇష్టం కాబట్టి.. ఇలా తమకు తామే ఎల్లో మీడియా అని ప్రకటించేసుకున్నాయి. ఇదే సంఘటన జగన్​ సభలోజరిగితే నా సామిరంగా ఈ రెండు పేపర్ల కవరేజీ తీరే వేరే ఉండేది. యాడ్స్​ వచ్చినా వేయకుండా పరిచేసేవీ. ఇక సాక్షి విషయానికొస్తే కవరేజీలో ఆ పేపర్​ ‘షో’క సంద్రం’ హెడ్డింగ్ పెట్టడంతో పాటు  కూలి కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారంటూ రాసుకొచ్చి పరువు పోగోట్టుకుంది. ఏ పార్టీ మీటింగ్​ పెట్టినా.. కూలి ఇస్తేనే సభలకు జనం వచ్చేట్టుగా చంద్రబాబే చేశారు. ఇప్పుడు అన్ని పార్టీలూ ఇదే పద్దతిని అనుసరిస్తున్నారు. చివరకు ఆందోళన కార్యక్రమాలైన సరే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here