ఒకప్పుడు నమస్తే తెలంగాణలో మంత్రి హోదాలో ఈటల రాజేందర్ న్యూస్ తరచూ వచ్చేది. బ్యానర్ స్థాయిలో కాకున్నా న్యూస్ అయితే వచ్చేదనుకో. నమస్తేలో బ్యానర్ రావాలంటే… కేసీఆర్ కుటుంబానికే అర్హత అంటూ ఉంటారు. ఇందులో హరీశ్‌కు కూడా చోటు లేదంటారు. నిజానిజాలు ఆ పేపర్ చదివే వారికే ఎరుక. ఆ పేపర్ చూద్దామంటే అంతా టీఆర్ఎస్ సారీ బీఆర్ఎస్ వార్తలే కాబట్టి.. అంతగా రుచించక.. పక్కన పెట్టేస్తున్నారనుకో. ఆ సంగతి మనకెందుకు కానీ.. ఇయ్యాల్టీ నమస్తేను ఎందుకో ఓపెన్ చేశా. ఈటల రాజేందర్ వార్త కన్పించింది. హబ్బా నమస్తేలో ఈటల వార్తే అనుకొని చదివా. ఈటలను నెటిజన్లు ఆడుకుంటున్నారని పేర్కొంటూ ‘జవాబు లేక ఈటల విలవిల’ అంటూ వార్త వచ్చింది. సొంతంగా పార్టీ పెట్టాలని అనుకునే వాడినంటూ చెప్పారని పేర్కొన్న ఈ వార్తలో ఆస్తులు కాపాడుకోవడానికే బీజేపీలో చేరినట్టు పరోక్షంగా ఒప్పుకున్నారని నమస్తే సొంత పైత్యం రాసుకొచ్చింది. ఈటల చెప్పినదానికి.. నమస్తే సొంత పైత్యానికి ఎక్కడా ట్యూన్ కావడం లేదు. అయినా వాళ్ల పత్రిక.. వాళ్లిష్ట మొచ్చినట్టుగా రాసుకుంటారు.
