ఏం జరిగినా.. ఏంటీ ఏం జరిగినా సరే అది తెలంగాణ ప్రజల సమస్యే.. అది వారిపై జరిగిన దాడే. కచ్చితంగా అది తెలంగాణ ప్రజలపై దాడియే. కాదంటరా..? కాదంటారా..? ఆ సాహసం చేస్తరా..? లేదు లేదు మాపై ఏ ఆరోపణలు వచ్చినా..ఐటీ..ఈడీ దాడులు చేసినా అవన్నీ కచ్చితంగా తెలంగాణ ప్రజలపై దాడియే అని బీఆర్ఎస్ చెబుతోంది. మనం వినాలి అంతే. మొన్న కవిత అదే తెలంగాణ యువరాణి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసులో ఉన్నారని ఈడీ విచారణకు వచ్చింది. నిజా నిజాలేమిటో తేలుతాయి. కానీ దాన్నేమన్నారు తెలంగాణ ఆడపడుచులపై దాడియే అన్నారు. ఇప్పుడు ఫైలట్ రోహిత్‌రెడ్డి అదే ఎమ్మెల్యేల కొనుగోలు కేసును కేసీఆర్‌కు చెప్పి.. వార్తల్లో నిలిచిన వ్యక్తి. ఆయనపై కూడా ఈడీ కన్నేసింది. రెండుమార్లు విచారణ చేసింది. ఈ కేసుకు సంబంధించి నిజానిజాలేమిటో సంగతి తరువాత. ఈయన కూడా ఏమంటున్నారు. ఇది నా సమస్య.. బీఆర్ఎస్ సమస్య కాదు.. తెలంగాణ ప్రజల సమస్య అంటున్నారు. నిజమే వాళ్లు ఏం చేసినా తెలంగాణ ప్రజల కోసమే. రోహిత్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరింది ఆయన కోసం కాదు కాదు కాదు తెలంగాణ ప్రజల కోసమే. ఆయనే కాదు ఆ పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేసినా అది తెలంగాణ ప్రజల కోసమే.. కోసమే.. కోసమే. కాదంటరా..? మీ ఇష్టం.
- breaking news
- Tech
- Entertainment
- Politics
- కామెడి
- క్రైమ్
- జాతీయం
- తాజా వార్తలు
- తెలంగాణ/ఆంధ్రప్రదేశ్
- మీడియా
- సినిమా
- రివ్యూస్