Home breaking news పొలిటికల్​ న బూతో న భవిష్యత్​

పొలిటికల్​ న బూతో న భవిష్యత్​

107
0

రాజకీయ నాయకుల మాటల కంటే గల్లీ జనాల మాటలు బెటర్​ అని ఊరకే అనలేదు. ఇది వరకు వీధి నల్లాలు ఉన్నప్పుడు ఆడోళ్లు నెత్తులు పట్టుకొని కొట్టుకొంటూ నోటికొచ్చిన బూతులు విసిరేవాళ్లు. ఆ తర్వాత మగవాళ్ల రంగ ప్రవేశం. ఇక న బూతో న భవిష్యత్​ అన్నట్టుగా ఉండేదీ. రాను రాను ఇదే వాడుక భాష అయింది. పైగా తెలంగాణ వాళ్లు ఇట్లనే మాట్లడతరని ఈ రాజకీయ నాయకులు చెప్పడం. పేపర్లలో కూడా అట్లనే రాసేస్తున్నరు.ఇప్పటి విషయానికొస్తే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ‘సీఎం కేసీర్​ ముఖం మీద ఢిల్లీలో ఉంచుతరు’ అంటూ కామెంట్​ విసిరాడు. దీనికి వెనుకా ముందు ఏంటంటే.. యాదాద్రి భువనగిరి జిల్లాలో బస్వాపురం రిజర్వాయర్​ నిర్మిస్తున్నారు. దీనికింద బీఎన్​ తిమ్మాపురం మునిగిపోతోంది. పరిహారం కోసం ఆ ఊరు వాళ్లు బస్వాపురం రిజర్వాయర్​ పనులు ఆపి.. నెల రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల వద్దకు వచ్చిన ఎంపీ కోమటిరెడ్డి ‘‘దేశం కోసం బీఆర్​ఎస్​ పార్టీ పెట్టానని సీఎం కేసీఆర్​ చెబుతున్నరు. రూ. 350 కోట్ల కోసం ఎంపీనైన తాను ఈ కట్ట మీదే పడుకుంటే నీకు బుద్ది ఉందా అని ఢిల్లీలో కేసీఆర్​  ముఖం మీద ఊస్తరు”అని అన్నారు.  ఈ కామెంట్​వెనుక ఉన్న సీన్​ ఇదే. ఈ ముఖం మీద ఊంచేస్తరు అని అనకుండా కూడా మాట్లాడవచ్చు. కానీ రాజకీయాలు కదా ఇలానే మాట్లాడిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here