Home breaking news బీఆర్​ఎస్​ను మరీ అలా అంటే ఎలా బండి

బీఆర్​ఎస్​ను మరీ అలా అంటే ఎలా బండి

116
0

నిక్​ నేమ్​లు పెట్టడంలో తెలంగాణ ప్రజలు దిట్ట. సరదాగా.. వ్యంగ్యంగా పిలుస్తూనే ఉంటారు. ఓ ఊరిలో కిష్టయ్యలు ఇద్దరు ఉంటే.. అందులో ఒకడు పొట్టిగా, మరొకడు దొడ్డుగా ఉండేవాడు. అందుకే పొట్టిగా ఉండే వ్యక్తిని పొట్టి కిష్టయ్య అని, ఇంకొకడిని దొడ్డు కిష్టయ్యగా పిలవడం మొదలెట్టారు. ఒక ఇంటి పేరుతో ఒకే పేరు కలిగిన వాళ్లుంటే వాళ్లు చేసే పని బట్టి పిలవడం అలవాటే. ఇవి రాజకీయ పార్టీలు, అనుబంధ సంఘాలకు మినహాయింపేమీ కాదు. ఆర్​ఎస్​ఎస్​ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ. ఈ సంఘాన్ని అటల్​ బిహరీ వాజ్​పాయ్​ అని పిలిచివాళ్లు. ఓ కమ్యూనిస్టు పార్టీకి అనుబంధ సంఘం పీడీఎస్​యూ. దీన్ని పూరీ, దోశ, సాంబార్​, ఉప్మా అని సరదాగా పిలిచేవాళ్లు. ఈ రెండు సంఘాలను కోపంగా పిలిచివాళ్లు ఉంటే మరో రకంగా. జాతీయ స్థాయిలో రాహుల్​ గాంధీ, ఆంధ్రప్రదేశ్​లో నారా లోకేశ్​ను పప్పు అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టీఆర్​ఎస్​ ను జాతీయ పార్టీగా చేయడానికి కేసీఆర్​.. బీఆర్​ఎస్​గా మార్చారు. అప్పటి నుంచి ఒకరు బీఆర్​ఎస్​కు వీఆర్​ఎస్​ అంటూ ఉంటే బీజేపీ బండి సంజయ్​ మరో పేరు పెట్టారు. బీఆర్​ఎస్​ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ బండి సంజయ్​ను టీఆర్ఎస్​ వాళ్లు, కేసీఆర్​ను తీన్మార్​ మల్లన్న అలియాస్​ చింతపండు నవీన్​ ఏమని పిలుస్తారో తెలుసుగా. మళ్లీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here