అక్రమ మద్యం కేసులో చిక్కుకున్న కల్వకుంట్ల కవితను సీబీఐ విచారించింది. మళ్లోసారి రావాలని నోటీసులు ఇచ్చిందని అంటున్నారు. సీబీఐ విచారణకు ముందు.. విచారణ తర్వాత కవిత తన తండ్రి తెలంగాణ సీఎం కేసీఆర్కు కలిసి చాలా గంటలు చర్చలు జరిపింది. హే చర్చలు కాదు మన్ను, మశానం కాదు.. ఇంట్లోకి పోయి ఏడ్చిందని గిట్టని కాంగ్రెస్, బీజేపీ వాళ్లు అంటున్నారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ, నిన్నటికి నిన్న కల్వకుంట్ల కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తెలంగాణ ఆడపడుచుల కండ్లల్లో కన్నీళ్లు రావు. నిప్పులు కురుస్తాయని. ఈ వార్నింగ్ ఎవరిని ఉద్దేశించి ఇచ్చిందో అందరికీ తెలుసు. కవిత ఇచ్చిన వార్నింగ్తో తెలంగాణ బీజేపీ కాదు కాదు దేశంలోని బీజేపీ లీడర్లు మొత్తం వణికి పోతున్నారని టీఆర్ఎస్ పక్కా అభిమానులు అంటున్నారు. ఇంతకీ వీళ్లన్నట్టుగా బీజేపీ లీడర్లు వణికి పోతున్నారా..? ఈ సంగతి తెలియదు కానీ బీజేపీ సంజయుడు మాత్రం మాటల తూటాలు విసురుతున్నాడు.