Home breaking news చేతులు కాలినంక ఆకులు పట్టుకుంటున్న కాంగ్రెస్​

చేతులు కాలినంక ఆకులు పట్టుకుంటున్న కాంగ్రెస్​

133
0

రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయని ఎప్పుడూ చెప్పేమాటే. రాజకీయాల్లో ఆత్మహత్యల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ దేశంలో ఆత్మహత్య చేసుకున్న పార్టీ ఐదేనా ఉందంటే.. అది జనతా పార్టీ. ఈ పార్టీలోంచి పుట్టుకొచ్చిన కొన్ని రెమ్మలు కర్ణాటక, బిహార్​, ఒడిషా, యూపీలో ఉన్నాయి. చనిపోకుండా కోమాలోకి పోయిన పార్టీల్లో ముందుగా చెప్పుకోవాల్సి కమ్యూనిస్టు పార్టీలే. పొత్తులు పెట్టుకోవడం, అందునా మార్చి పొత్తులు పెట్టుకోవడం. ఎన్నికలు వేరు.. రాజకీయాలు వేరు అంటూ సుద్దులు చెప్పడంతోనే ఆ పార్టీలు కనుమరుగూ అవుతున్నాయి. ఈసారి ఏపీలో జరిగే ఎన్నికల్లో టీడీపీ పవర్​లోకి రాకుంటే.. ఆ పార్టీ కూడా చివరి దశకు చేరుకున్నట్టే. ఇప్పటి విషయానికొస్తే అటూ కోమాలోకి పోకుండా.. ఇటు ఐసీయూలోనూ సరిగా లేకుండా ఉన్నామూ అంటూ ఉన్నామూ అంటూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా.. సోనియాతో పాటు రాహుల్​ గాంధీ కూడా నానుస్తున్నాడు. కొన్ని నిర్ణయాలు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా తీసుకుంటున్నారు. అలాంటి నిర్ణయమే.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టడం. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత కోమటిరెడ్డిని టీపీసీసీ జంబో కమిటీలోకి తీసుకోలేదు. ఎప్పుడైతే కోమటిరెడ్డి పక్క చూపులు చూస్తూ పార్టీ అధిష్ఠానంపై అప్పుడప్పుడూ అసహనం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేసినా పట్టించుకోలేదు. ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డిపై కూడా చర్యలు తీసుకోలేదు. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే వరకు వచ్చింతర్వాత నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి ఎంపీ కోమటిరెడ్డి దూరంగా ఉన్నా.. నిర్ణయం తీసుకోవడానికి వెనుకడుగు వేసింది. అన్ని అయిపోయిన తర్వాత.. ఇక బీజేపీలో చేరుతాడేమో అన్న అనుమానంతో ఇప్పుడు టీపీసీసీలో మాత్రమే చోటు కల్పించలేదు. ఎంపీ కోమటిరెడ్డిపై చర్య తీసుకోవడంలో ఇంకా కాంగ్రెస్​లో ఊగిసలాటే ఉంది.  తీరా బీజేపీలో చేరుతాను అని ప్రకటించిన తర్వాతే బహిష్కరణ అస్త్రం ప్రకటించేటట్టుగా ఉంది. అందుకే చేతులు కాలిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడం అంటే ఆకులు పట్టుకోవడంలో కాంగ్రెస్​ బిజీగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here